కేటీఆర్ కు ఆ పదవి ? కేంద్రం కీలక నిర్ణయం ?

తెలంగాణ ఐటి మంత్రి కెసిఆర్ కుమారుడు కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ఆయన తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా , ఆ పలుకుబడి పెద్దగా ఉపయోగించుకోకుండా తనకు తాను ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటూ సొంత ఇమేజ్ ను సంపాదించుకున్నారు.

 Telangana, Trs Party, Kcr, Ktr, It Minister, Corona Virus, Central Government, C-TeluguStop.com

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.అదే సమయంలో మంత్రి గా ప్రజా సమస్యల విషయంలో ప్రతి సందర్భంలో స్పందిస్తూ అందరికీ చేరువయ్యారు.

దీంతో ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ పేరు తెలంగాణ రాజకీయాల్లో హైలెట్ అవుతూ వస్తోంది.త్వరలో ఆయన సీఎం గా బాధ్యతలు అప్పగించేందుకు కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

తన తెలివితేటలతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ప్రజల్లోనూ అభిప్రాయం ఏర్పడింది.

ఐటీ మంత్రిగా ఐటీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కేటీఆర్ తన ప్రతిభను ఇప్పటికే చాటుకున్నారు.

అయితే ఇప్పుడు ఇదే కేటీఆర్ కు ఓ కీలక పదవి దక్కే అవకాశాన్ని తీసుకువచ్చింది.కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఐటి రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

దీన్ని మళ్ళీ బలోపేతం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు దేశంలో ఐటీ నిపుణులు, మంత్రులతో కలిసి కేంద్రం ఓ కమిటీని వేస్తోంది.

ఆ కమిటీలో ప్రతిభ ఉన్న నాయకులను తీసుకోవాలని కేంద్రం ఆలోచిస్తోంది.ఇక హైదరాబాద్ కూడా ఐటీ రంగానికి చాలా కీలకం గా ఉంది.

తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న ఐటీ రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే, మంత్రులు కూడా సమర్థవంతంగా పనిచేయాలి.ఈ విషయంలో కేటీఆర్ సమర్థవంతంగా పని చేస్తున్నారు.

Telugu Central, Corona, Telangana, Trs-Political

అందుకే ఇప్పుడు కేంద్రం టిఆర్ఎస్ పార్టీ తో ఉన్న వైరం కూడా పక్కనపెట్టి కేటీఆర్ ను కేంద్ర మంత్రులు నిపుణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న కమిటీకి చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కేవలం అధ్యక్ష పదవినే కాకుండా , దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే విధంగా కూడా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కమిటీ చైర్మన్ పదవి తీసుకునే విషయంలో కేటీఆర్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన కసరత్తు మొదలవబోతోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube