Krishna Makeup Man Madhavrao : ఆ సమయంలో కృష్ణ డబ్బు మూటలు తెచ్చి పంచారు.. మేకప్ మ్యాన్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ మరణించి ఏడు రోజులైన సంగతి తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ నటించిన అన్ని సినిమాలకు నేనే పని చేశానని మేకప్ మ్యాన్ మాధవరావు అన్నారు.

 Krishna Makeup Man Comments Goes Viral In Social Media Details Here , Krishna, M-TeluguStop.com

కృష్ణ గారి జీవితంలోకి విజయనిర్మల గారు చాలా హెల్ప్ ఫుల్ గా ఉన్నారని తెలిపారు.కృష్ణగారు ఔట్ డోర్ షూటింగ్ లకు వెళితే టైమ్ టేబుల్ ప్రకారం భోజనాలు అందేలా చూసుకున్నారని మాధవరావు వెల్లడించడం గమనార్హం.

ఎక్కడికెళ్లినా విజయనిర్మల వంటసామాగ్రి తీసుకుని వచ్చేవారని మాధవరావు అన్నారు.డ్యాన్స్ విషయంలో తనపై వచ్చే విమర్శలను కృష్ణ పట్టించుకునేవారు కాదని మాధవరావు అన్నారు.కృష్ణ చాలా సందర్భాల్లో తనను తాను మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.కొన్ని సినిమాలలో ఆయన ట్రెండ్ సృష్టించారని మాధవరావు వెల్లడించారు.

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్టైల్ ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.

డబ్బు విషయంలో కృష్ణ ఆలోచించేవారు కాదని కురుక్షేత్రం కోసం ఆయన ట్రైన్ వేశారని మాధవరావు తెలిపారు.

కృష్ణ చేసిన కొన్ని సినిమాలు మరో హీరోకు చేయడం కూడా సాధ్యం కాదని ఆయన అన్నారు.డబ్బు మూటలు తెచ్చి రెమ్యునరేషన్లు ఇచ్చారని మాధవరావు పేర్కొన్నారు.కృష్ణ మరణంతో ఇండస్ట్రీ చాలా నష్టపోయిందని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Telugu Krishna, Madhavrao, Vijayanirmala-Movie

కృష్ణగారు నాకు సన్మానం చేశారని ఆయన పేర్కొన్నారు.కొన్ని సినిమాల విషయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని మాధవరావు చెప్పుకొచ్చారు.నేను ఎన్టీఆర్ గారితో కూడా పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

కృష్ణగారికి ఎన్టీఆర్ అంటే ప్రేమ ఎక్కువ అని మాధవరావు తెలిపారు.కృష్ణ ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు.

కృష్ణ భౌతికంగా దూరమైనా ప్రజల హృదయాల్లో మాత్రం నిలిచి ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube