మామూలుగా సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే దాంట్లో నిజానిజాలు తెలుసుకోకుండానే చాలామంది వాటిని షేర్ చేయడం వాటి గురించి నెగిటివ్ గా కామెంట్ చేయడం మనం తరచూ చూస్తూనే ఉంటాం.
మరీ ముఖ్యంగా కొన్ని కులాలను, మతాలను టార్గెట్ చేస్తూ షేర్ అయ్యే వీడియోలు ఆయా వర్గాల వారి మనోభావాలను దెబ్బతీస్తుంటాయి.ఇప్పుడు అలాంటి వైరల్ వీడియోనే ఒకటి ఒక వర్గానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
ఇందులో ఓ పెళ్లి వేడుకలో పురోహితుడిని దారుణంగా అవమానించారు.
ఆయనతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ ఆట పట్టించారు.దీనిపై ఆగ్రహం చెందిన సదరు పెళ్లి పంతులు మండపం నుంచి వెళ్లిపోతాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా ఈ వీడియోపై బీజేపీ ప్రముఖ నాయకురాలు యామినీ శర్మ( Yamini Sharma ) ఈ వీడియోపై రియాక్ట్ అయ్యారు.పురోహితుడిని ఇంత దారుణంగా అవమానించడం చాలా దారుణం.
కేవలం బ్రాహ్మణులే కాదు సమాజంలోని ప్రతీ హిందువూ దీన్ని తీవ్రంగా ఖండించాలి.ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగిందో నాకు తెలియదు కానీ ఎలాంటి సందర్భం అయినా ఇలా చేయడం మహా పాపం అని రాసుకొచ్చారు యామీనీ శర్మ.
ఇక రచయిత కోన వెంకట్( Kona Venkat ) కూడా ఈ వీడియోపై ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.ఇది అత్యంత హేయనీయం.ఖండనీయం.అన్ని కులాలను, మతాలను సమాన దృష్టితో చూడడంలో బ్రాహ్మణులు ముందుంటారు.వారిని గౌరవించక పోయినా పర్వాలేదు.అవమానించకండి అని ట్వీట్ చేశాడు కోన.తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా స్పందిస్తూ.ఇదం బ్రాహ్మం.
ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని ట్వీట్ చేశాడు.