వైరల్ వీడియో: ధావన్‌ను ఫన్నీగా ఇమిటేట్ చేసిన కోహ్లీ.. పగలబడి నవ్వుతున్న ఫ్యాన్స్!

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కేవలం క్రికెట్ ఆడటంలోనే కాదు డాన్స్ వేయడంలో, సెలబ్రేషన్స్ చేసుకోవడం లోనూ కోహ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు.

 Kohli Imitates Dhawan In A Funny Way Fans Bursting Out Laughing! Virat Kohli,-TeluguStop.com

ఫన్నీ ఫేసులు పెడుతూ అభిమానులను తెగ నవ్వించడంలో కోహ్లీ ముందుంటాడు.అయితే తాజాగా అతను సీనియర్ బ్యాట్స్‌మన్‌ ధావన్‌ను ఇమిటేట్ చేసి నవ్వులు పూయిస్తున్నాడు.“ధావన్‌ బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను ఇమిటేట్ చేసి చూపిస్తాను” అంటూ కోహ్లీ ఓ చిన్న వీడియో క్లిప్‌ను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేశాడు.

ఈ వీడియోలో ధావన్ బ్యాటింగ్‌ స్టైల్‌ను తాను చాలాసార్లు గమనించానని అది చాలా ఫన్నీగా ఉంటుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత ధావన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు తన భుజాలపై ఉన్న జెర్సీని ఎలా సర్దుకుంటాడో కోహ్లీ చేసి చూపించాడు.అంతేకాదు, ధావన్‌ బ్యాట్ పట్టుకొని క్రీజ్లో బాల్ కోసం ఎలా ఎదురు చూస్తాడనేది కూడా హాస్యాస్పదంగా చూపించాడు.

అలాగే ఒక బ్యాడ్ బాల్ ను వదిలేసి ఆ తర్వాత ధావన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ను అనుకరించి తెగ నవ్వించేసాడు.ప్రస్తుతం ఈ వీడియో చూసి ఫ్యాన్స్‌ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోకి 9 లక్షల వ్యూస్, లక్ష లైకులు, 3 వేల కామెంట్లు వచ్చాయి.ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న దీనిపై నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

అద్భుతంగా చేశారు అంటూ మరికొందరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఈ క్రమంలోనే ధావన్‌ను ఇమిటేట్ చేసి ఆశ్చర్య పరిచాడు.అయితే ధావన్ అంతర్జాతీయ ఆటల్లో జోరుగా ఆడలేక పోతున్నాడని అతన్ని పక్కన పెట్టేశారు.

ధావన్‌ ఐపీఎల్‌ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున 16 మ్యాచ్‌ల్లో 587 పరుగులు చేసి టాప్ స్కోరర్‌ లిస్టులో నాలుగో స్థానం దక్కించుకున్నాడు.కానీ అతన్ని మాత్రం టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో తీసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube