కేవలం రూ.10కే కేఎఫ్‌సీ-స్టైల్ ఫ్రైడ్ చికెన్‌.. ఏంటీ, ఇది నిజమా అంటూ నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

మీకు ఫింగర్-లిక్కింగ్ ఫ్రైడ్ చికెన్‌ ( Finger-Lickin Fried Chicken )అంటే ఇష్టమా, తినాలని ఉన్నా బ్యాంకు ఖాతాకు చిల్లు పడుతుందని భయపడుతున్నారు.ఇకపై మీకు ఆ భయం అక్కర్లేదు.ఎందుకంటే భారతదేశంలోని ఒక వీధి వ్యాపారి KFC తరహాలో వేయించిన చికెన్‌ ముక్కను కేవలం రూ.10కే అందిస్తున్నాడు.వినడానికి నమ్మేలా లేకున్నా అది నిజం.మీరు ఇప్పుడు మీ జేబుకు బొక్క పడకుండా క్రిస్పీ, జ్యూసీ చికెన్ తినొచ్చు.నోరూరించే ఈ చీప్ చికెన్ గురించి తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఏంటీ, ఇది నిజమా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

 Kfc-style Fried Chicken Only For 10-rupees Street Vendor Viral Video , Treet Ve-TeluguStop.com

సాధారణంగా బయట చికెన్ కొనాలంటే రూ.వందల్లో ఖర్చు చేయక తప్పదు.కానీ ఈ స్ట్రీట్ వెండార్ ( Street vendor )దగ్గర రూ.100 పెడితే కడుపునిండా ఫ్రైడ్ చికెన్ లాగించవచ్చు.ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో రుచికరమైన ఐటమ్స్ దొరుకుతుంటాయని అనడంలో సందేహం లేదు.అవి చీప్‌గానూ ఉంటాయి.అయితే వాటిని మరీ చీప్‌గా అమ్మినప్పుడే వైరల్ అవుతుంటాయి.సరిగ్గా ఇప్పుడదే జరిగింది.10కే లభిస్తున్న కేఎఫ్‌సీ-స్టైల్ ఫ్రైడ్ చికెన్‌ ముక్కకు సంబంధించి ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో వైరల్ అయింది.

@therealharryuppal అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ దీనిని షేర్ చేసింది.‘అందరినీ వెర్రోళ్లను చేయొద్దు‘ అని దీనికి ఒక క్యాప్షన్ కూడా జత చేసింది.ఈ వీడియోలో బోన్-లెస్ చికెన్ ముక్కలను మసాలా దినుసులలో మిక్స్ చేయడం గమనించవచ్చు.

ఆపై వాటిని ఫ్రై చేసి ప్లేట్స్ లో పెట్టి అందించడం చూడవచ్చు.కాగా ఈ వీడియో చూస్తుంటేనే తమకు నోరూరుతోందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.రూ.10 అని చెప్పి కాకి మాంసంతో ఇవి తయారు చేస్తున్నారా, ఏంటీ అని ఒక యూజర్ కామెంట్ చేశారు.‘అతను పెద్ద మొత్తంలో చికెన్ కొంటాడేమో.250 గ్రాముల చికెన్ బ్రేస్ట్‌కి ఈజీగా 10-15 పీస్‌లు వస్తాయి.అలా ఈ వ్యక్తి ప్రాఫిట్స్ పొందుతూ ఉండొచ్చు.ఇందులో మోసమేమీ ఉండకపోవచ్చు’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.ఈ వీడియోని మీరూ చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube