పోలవరం ప్రాజెక్టులో కీల‌క‌ఘ‌ట్టం.. ప్రాజెక్టు స్పిల్ వే పనులు పూర్తి

పోలవరం ప్రాజెక్టులో కీల‌క‌ఘ‌ట్టం.పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులు పూర్తి.

 Key Event In Polavaram Project Spillway Works Completed Details, Polavaram Proje-TeluguStop.com

మిగిలిన హైడ్రాలిక్ సిలిండర్ అమ‌ర్చ‌డంతో స్పిల్ వే నిర్మాణ ప‌నులు పూర్తి.స్పిల్ వేలో 48రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తి.

అదేవిధంగా 96 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు సైతం పూర్తి.గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్ల ఏర్పాటు పనులు పూర్తి.10 రివర్ స్లూయిజ్ గేట్ల ఏర్పాటు తో పాటు,వీటికి ఒక్కో దానికి 2చొప్పున 10గేట్లకు 20హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు పూర్తి.రివర్ స్లూయిజ్ గేట్లను ఎత్తడానికి అవసరమైన 10 పవర్ ప్యాక్ సెట్ల అమరిక పనులు సైతం పూర్తి.ఇప్పటికే ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తి.140మీ పొడవున,53.320మీ ఎత్తున,12.5మీ వెడల్పున గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం పూర్తి.

52మీ ఎత్తున స్పిల్ వే గైడ్ బండ్ నిర్మాణ పనులు సైతం వేగవంతం.అప్రోచ్ ఛానెల్ లో 64.88లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకం పనులు పూర్తి.ఫైలెట్ ఛానెల్ లో 5.5లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి.42.5మీ ఎత్తున 2480మీ పొడవున ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మాణం పూర్తి.1630మీ పొడవున,30.5మీ ఎత్తున దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణం పనులు సైతం జోరుగా సాగుతున్నాయి.ఈసిఆర్ఎఫ్ ఢ్యాం నిర్మాణం కు సంబందించి గ్యాప్-2 ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి.గ్యాప్-1లో ఇప్పటికే డివాల్ నిర్మాణం పూర్తి కాగా, నేలను గట్టిపరిచే వైబ్రో స్టోన్ కాలమ్ పనులు పూర్తి అవ్వడంతో పాటు డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు సైతం దాదాపు పూర్తి కావొచ్చాయి.

Telugu Ap, Ap Polavaram, Hydro, Polavaramcopper-Latest News - Telugu

జలవిద్యుత్ కేంద్రంలో ఇప్పటికే కొండ తవ్వకం పనులు పూర్తి.జలవిద్యుత్ కేంద్రంలో 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు సైతం పూర్తి.ప్రెజర్ టన్నెల్స్ లో ఫెరల్స్ అమ‌రిక ప‌నులు సైతం ప్రారంభం.

జలవిద్యుత్ కేంద్రంలో ఎర్త్ మ్యాట్ కాంక్రీట్ పనులు సైతం వేగవంతం.స్పిల్ వే లో హైడ్రాలిక్ సిలిండ‌ర్ అమ‌రిక ప‌నులను ప‌ర్య‌వేక్షించిన జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు పోల‌వ‌రం ప్రాజెక్టు సిఈ సుధాక‌ర్ బాబు, ఎస్ఈ న‌ర‌సింహ‌మూర్తి, ఈఈ సుధాక‌ర్ రావు, డిఈఈలు ముర‌ళీమోహ‌న్, శ్రీనివాస్, మేఘా ఇంజ‌నీరింగ్ సంస్ద సిజిఎం ముద్దుకృష్ణ‌, డిజిఎం రాజేష్ కుమార్, సీనియ‌ర్ మేనేజ‌ర్ ముర‌ళి త‌దిత‌రులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube