భారతదేశంలోని కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల పోలాండ్‌లో హత్యకు గురయ్యారు.మొదటి వ్యక్తి సూరజ్‌కి 23 సంవత్సరాలు ఉన్నాయి.
అతను ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.ఆదివారం అంటే జనవరి 29న జార్జియా పౌరుడితో జరిగిన గొడవలో అతడు చనిపోయాడు.
నివేదికల ప్రకారం, ఒక వీకెండ్ సెలబ్రేషన్స్‌లో స్మోకింగ్ చేయడంపై జార్జియన్ పౌరుడితో జరిగిన మాటల యుద్ధం హత్యకు దారితీసింది.జార్జియా పౌరుడు సూరజ్ ఛాతీ, మెడపై కత్తితో దాడి చేశాడు.
ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మరో నలుగురు భారతీయులు కూడా గాయపడ్డారు.బాధితుడు కేరళలోని త్రిసూర్‌లోని ఒల్లూరు పట్టణంలో నివసిస్తున్న 23 ఏళ్ల సూరజ్‌గా గుర్తించారు.
సూరజ్ సెప్టెంబరు 2022లో పోలాండ్ వెళ్లాడు.అతను మొదట్లో పోలాండ్‌లోని ఓడ నిర్వహణ కంపెనీలో సూపరింటెండెంట్‌గా పనిచేశాడు.ఈ ఉద్యోగం కష్టంగా దీనికి బదులు వేరే జాబ్ ఇవ్వాల్సిందిగా కోరగా సూరజ్‌కి మీట్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చారు.కాగా అతని మర్డర్ కంపెనీ అపార్ట్‌మెంట్‌లో జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక ఇబ్రహీం అనే మరో 30 ఏళ్లు కూడా పోలాండ్‌లో చనిపోవడం సంచలనంగా మారింది.
ఇబ్రహీం గత 10 నెలలుగా పోలాండ్‌లో నివసిస్తున్నాడు.అతడు కనిపించకుండా పోయి ఓ ఇంట్లో శవమై కనిపించాడు.ఇబ్రహీంను హత్య చేసిన ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆస్ట్రేలియాలో, తిరంగా యాత్ర అనే కవాతుపై ఖలిస్తాన్ మద్దతుదారులు అనే వ్యక్తులు దాడి చేశారు.ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు.ఈ విధంగా విదేశాల్లో జీవిస్తున్న ఎన్ఆర్ఐలపై వరుస దాడులు జరగడం కలకలం రేపుతోంది.