Russia Elections : రష్యా అధ్యక్ష ఎన్నికలు.. కేరళలో పోలింగ్ , ఎందుకిలా..?

ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటైన రష్యాలో( Russia ) ఎన్నికలంటే అన్ని దేశాలకు ఆసక్తి.ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంతో పాటు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు( Russian Presidential Elections ) సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

 Russia Elections : రష్యా అధ్యక్ష ఎన్నికల�-TeluguStop.com

వ్లాదిమిర్ పుతిన్‌కు( Vladimir Putin ) ఎదురులేనప్పటికీ రష్యా రాజకీయాలపై అన్ని దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.ఇదిలావుండగా .రష్యా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే ఇందుకోసం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోనూ( Kerala ) పోలింగ్‌కు ఏర్పాట్లు చేయడం ఆసక్తిని రేకిత్తిస్తోంది.

ఇక్కడ నివసిస్తున రష్యా పౌరులు ఓటు వేసేందుకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు చేశారు.త్రివేండ్రంలోని రష్యన్ హౌస్‌లోని పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో స్థిరపడిన రష్యా జాతీయులు ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.కేరళలో నివసిస్తున్న రష్యన్ పౌరులు, పర్యాటకుల కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆనరరీ కాన్సులేట్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ డైరెక్టర్ రతీశ్ నాయర్( Ratheesh Nair ) వెల్లడించారు.

Telugu Kerala, Leonid Slutsky, Ratheesh Nair, Russian, Trivandrum, Vladimir Puti

ఇకపోతే.శుక్రవారం నుంచి (మార్చి 15) ఆదివారం వరకు రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది.ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.లిబరల్ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్‌స్కీ,( Leonid Slutsky ) న్యూ పీపుల్ పార్టీకి చెందిన వ్లాదిస్లవ్ డవాంకోవ్,( Vladislav Davankov ) కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్( Nikolay Kharitonov ) పోటీ చేస్తున్నారు.

ఈ ముగ్గురు పుతిన్‌కు మద్ధతుదారులేనని అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.దాదాపు రెండు దశాబ్థాలుగా పుతిన్ రష్యాను ఎదురులేకుండా ఏలుతున్నారు.అప్పటి సోవియట్ యూనియన్ పాలకుడైన జోసెఫ్ స్టాలిన్ కన్నా ఎక్కువ కాలం పాటు రష్యా అధ్యక్షుడిగా వున్న వ్యక్తిగా పుతిన్ నిలిచారు.మరోసారి అధ్యక్షుడిగా విజయం సాధించి 2030 వరకు రష్యాను పాలించనున్నారు పుతిన్.2020లో రాజ్యాంగ సవరణ తర్వాత ఇక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

Telugu Kerala, Leonid Slutsky, Ratheesh Nair, Russian, Trivandrum, Vladimir Puti

కాగా.రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవల్నీ ఇటీవల జైలులో మరణించిన సంగతి తెలిసిందే.ఇది ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

పుతిన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించే వ్యక్తిగా నవల్నీకి గుర్తింపు వుంది.ఆర్కిటిక్ జైలు కాలనీలో 19 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్న నవల్నీ మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 16న అధికారికంగా ప్రకటించింది.

అయితే ఇది పుతిన్ పనేనంటూ విపక్షాలు , ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube