సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతోమంది పలు సందర్భాలలో వివరించారు.అవకాశాలు రావాలంటే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఇదివరకు ఎంతోమంది వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేశారు.
మరికొందరు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నిర్వహించారు.ఇలాంటి వారిలో సింగర్ చిన్మయి ( Chinmayi ) ఒకరు.
ఈమె పట్ల తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు( Vairamuthu ) లైంగిక ఆరోపణలు చేశారంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఆయన పట్ల విమర్శలు చేయడంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ సింగర్ చిన్మయిని బ్యాన్ చేశారు.అయితే తాజాగా ఈ విషయం గురించి నటి కస్తూరి శంకర్ ( Kasturi Shankar ) మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇండస్ట్రీ ఏదైనా ఈ విధమైనటువంటి ఆరోపణలు తప్పనిసరిగా ఉంటాయి.
కొంతమంది బయటకు వచ్చి చెప్తారు.కొంతమంది చెప్పరు.
నాకు కూడా మీటూ అనుభవం ఉంది.కానీ ఏదైనా చెప్పే విధానం ఉంటుంది.
సింగర్ చిన్మయి నేరుగా ఆరోపణలు చేస్తుంటారు.ఈమె వైరు ముత్తుపై ఆరోపణలు చేశారు కానీ ఆధారాలు మాత్రం తీసుకురాలేకపోయారు.
నాకు చిన్మయి తెలుసు.వైరముత్తు తెలుసు.25 ఏళ్లుగా వైరముత్తు గారు నాకు తెలుసు.ఆయన్ని ఎన్నోసార్లు కలిసాను ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడాను ఆ కానీ ఆయన ఎప్పుడూ కూడా నా దగ్గర అలా వ్యవహరించలేదు.ఆ వ్యక్తి చాలా పర్ఫెక్ట్.నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు.నా ఫెమినిజాన్ని చాలా మెచ్చుకునేవారు.నా ముక్కు సూటితనం ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు.
ఆయన ఎప్పుడు తనని ప్రోత్సహించారు తప్ప ఇబ్బంది పెట్టలేదని తెలిపారు.చిన్మయి క్యారెక్టర్ పరంగా చూస్తే అది బంగారు తల్లి.
చాలామంచిది.ఇద్దరు మంచి వాళ్ల మధ్య ఏం జరిగిందనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు.
దాని గురించి మనం మాట్లాడాలంటే ఆధారం కావాలంటూ కస్తూరి శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.