సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు.మెగాస్టార్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చరణ్ తన తండ్రి కీర్తి ప్రతిష్టలను పెంచుతూ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇక రాంచరణ్ సినీ కెరియర్లో రంగస్థలం ( Rangasthalam ) సినిమాకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పాలి.సుకుమార్( Sukumar ) డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో చరణ్ నటన అద్భుతమని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ చాలా సింపుల్ గా ఉంటుంది.సాధారణ వ్యక్తిలా సైకిల్ పై వచ్చేలా ఈయన ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది.అయితే ఈ సినిమాలో రాంచరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి సుకుమార్ ఒక సందర్భంలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని ఒక సాధారణ వ్యక్తిలా సైకిల్ తొక్కుతూ వచ్చేలా ఇంట్రడక్షన్ సీన్ పెట్టారు.
దీనిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం మీకు కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు సుకుమార్ సమాధానం చెబుతూ కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు.ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.అందుకే సైకిల్ లో చూపించా.
లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి.ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం ( Ramcharan )దగ్గరికి కెమెరా రావాలి.
కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.అయితే నేను అనుకున్న విధంగా ఈ షాట్ రాకపోవడంతో ఆ సీన్ ని సీజీ వర్క్ లో పూర్తి చేశామాని సుకుమార్ చెప్పారు.
ఇలా ఈయన అదంతా రియల్ కాదు సీజీ వర్క్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.