తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద స్కామ్ అని, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు.
ప్లానింగ్, డిజైనింగ్ లోపం వలనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని షర్మిల తెలిపారు.కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టును రూపకల్పన చేశారని మండిపడ్డారు.
ప్రాజెక్టు ఖర్చును మూడింతలు చేశారన్న షర్మిల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వెల్లడించారు.