సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హిట్టు ఫ్లాపులు సహజం.ప్రతి దర్శకుడు కూడా సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం తోనే సినిమాలు తీస్తూ ఉంటాడు కానీ చిత్ర బృందం ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నా.
కొన్నిసార్లు ప్రేక్షకులకు మాత్రం షాక్ ఇస్తూ ఉంటారు.హిట్టవుతుందనుకున్న కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ చేస్తూ ఉంటారు.
అదే సమయంలో కొన్ని సినిమాలకు ఊహించని విజయాలు అందిస్తూ వుంటారు ప్రేక్షకులు.ఇలా సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అన్నది కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది.
అయితే కొన్ని సినిమాలు మొదట్లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా తర్వాత మాత్రం అనుకున్నంతగా వసూళ్లు రాబట్టక ఫ్లాప్ గానే మిగిలిపోతుంటాయి.
కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత సూపర్ హిట్ అవుతూ ఉంటాయ్.
ఇక అలాంటి సినిమాలలో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా ఒకటి.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటిరోజు నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
దీంతో ఇక నిర్మాతలకు నష్టాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేశారు.ఇక అప్పటికే సుకుమార్ దర్శకత్వంలో వన్ నేనొక్కడినే లాంటి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన డిజాస్టర్గా నిలిచింది.
ఇక నాన్నకు ప్రేమతో సినిమా కూడా అంతే అనుకున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
ఇక ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ , రకుల్ ప్రీత్ సింగ్ తండ్రిగా జగపతిబాబు నటించారు.
2016 లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అది ఒక వైపు ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంటే అదే సమయంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన, బాలకృష్ణ డిటెక్టర్, శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో ఈ సినిమాకు మరింత పోటీ పెరిగిపోయింది.దీంతో ఇక ఈ సినిమా పక్కా ఫ్లాప్ అనుకున్నారు అందరు.
కానీ మొదట్లో సుకుమార్ లాజిక్కులు అర్థం కాకపోయినా రెండో రోజు మాత్రం ప్రేక్షకులకు సినిమా తెగ నచ్చేసింది.దీంతో మెల్లగా పుంజుకుంటూ బాక్సాఫీస్ వద్ద అసలు సిసలైన పోటీ ఇవ్వడం మొదలుపెట్టింది.
ఇక మొత్తంగా చూసుకుంటే ఫ్లాప్ అవుతుందనుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.