తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జీవిత రాజశేఖర్( Jeevitha Rajasekhar ) ఒకరు.ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి జీవిత హీరో రాజశేఖర్( Rajasekhar ) ప్రేమించి తనని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా పెళ్లి తర్వాత ఈమె నటనకు స్వస్తి పలికారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె కుటుంబ బాధ్యతలను తన భర్త పిల్లల అవసరాలను తీరుస్తూ ఆదర్శ గృహిణిగా మిగిలిపోయారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జీవిత తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే మహిళల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.తాను పెళ్లి తర్వాత తన కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను నా కుటుంబం తర్వాతే నాకు ఏదైనా నా పిల్లల అవసరాలను తీర్చడం నాకు ఇష్టం అంటూ తెలియజేశారు.ఇకపోతే తాను పెద్దగా బయటకు వెళ్ళనని అందుకే నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగా లేదని జీవిత తెలిపారు.
ఇక మహిళలు మందు తాగడం గురించి కూడా ఈ సందర్భంగా జీవిత మాట్లాడారు తనకు అలాంటి అలవాటు లేదని ఈమె తెలియజేశారు.
ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను ఒక మహిళను కాబట్టి మందు తాగే అలవాటు లేదని నేను చెప్పడం లేదు.నాకు మందు( Alcohol )తాగడం ఇష్టం లేదు కాబట్టి నేను తాగడం లేదు అలాగని ఎవరైనా మహిళలు తాగుతుంటే ఎందుకు తాగుతున్నావ్ అని కూడా ప్రశ్నించను.అబ్బాయిలు తాగితే తప్పు లేనిది మహిళలు మందు తాగితే తప్పేంటని ఈమె ప్రశ్నించారు.
సరదాలు అనేవి అందరికీ ఉంటాయి.దానికి జెండర్ తో పనిలేదని , మందు తాగడానికి ఆడ మగ తేడా ఏం లేదని ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇక్కడ ఈమె ఉద్దేశం మహిళలను మందు తాగమని ప్రోత్సహించడం కాదని వారి ఇష్టాలను ప్రశ్నించే హక్కు మనకి లేదు అంటూ తెలిపారు అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.