Jayasudha : ఆ పొరపాటుతో 100 కోట్ల ఆస్తులను పోగొట్టుకున్న నటి జయసుధ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి జయసుధ ( Jayasudha ) ఒకరు.ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు సీనియర్ హీరోలైనటువంటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు వట్టి హీరోలు అందరితో కలిసి సూపర్ హిట్ సినిమాలలో నటించినటువంటి జయసుధ ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో బిజీగా ఉన్నారు.

 Jayasudha : ఆ పొరపాటుతో 100 కోట్ల ఆస్తు-TeluguStop.com

ప్రస్తుతం ఈమె అమ్మ క్యారెక్టర్లతో పాటు అమ్మమ్మ నానమ్మ పాత్రలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Telugu Jayasudha, Actress, Tollywood-Movie

ఇలా నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి జయసుధ భారీ స్థాయిలోనే ఆస్తులు( Properties ) కూడా పెట్టారు.అయితే తనకు తెలియకుండా చిన్నచిన్న పొరపాట్లు చేయడంతో వందల కోట్లు ఆస్తులను కోల్పోయాను అంటూ తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ మనకు ఆస్తులు పెరగాలంటే అదృష్టం కూడా ఉండాలి అంటూ కామెంట్లు చేశారు.

Telugu Jayasudha, Actress, Tollywood-Movie

చెన్నైలో( Chennai ) ఒక ప్రాంతంలో నేను స్థలం కొని ఒక బిల్డింగ్ కట్టాను అలా కట్టడంతో శోభన్ బాబు చాలా మంచి పని చేశావని నన్ను మెచ్చుకున్నారు.అయితే అక్కడ స్లంప్ రావడంతో ఎవరూ కూడా రెంటుకు రావడానికి ఇష్టపడలేదు దాంతో ఆ బిల్డింగ్ అమ్మేశాను అయితే ఇప్పుడు అదొక బిజి సెంటర్ గా మారిపోయిందని, దాని విలువ వందల కోట్లు ఉంటుందని ఈమె తెలిపారు.అలాగే చెన్నైలో ఒకచోట తొమ్మిది ఎకరాలు పొలం కొన్నాను.నీళ్లు పడలేదు అన్న కారణంతో ఆ తొమ్మిది ఎకరాలు అమ్మానని ఇప్పుడు ఆ తొమ్మిది ఎకరాలు విలువ కొన్ని  కోట్ల రూపాయల ధర పలుకుతుందని ఈమె తాను చేసినటువంటి చిన్న చిన్న తప్పులు కారణంగా వందల కోట్ల ఆస్తులను నష్టపోయాను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube