ఈరోజు థియేటర్లలో జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలు రిలీజ్ కాగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.జవాన్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా( Miss shetty mister polishetty )కు దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వం వహించారు.
ఈ రెండు సినిమాలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
జవాన్ సినిమా( Jawan movie )తో షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరింది.ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయని తెలుస్తోంది.సినిమాలో ఎమోషనల్ సీన్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.విజయ్ సేతుపతి, నయనతార తమ అద్భుతమైన నటనతో ఈ సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించారు.
షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉంది.ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం జవాన్ మూవీని యావరేజ్ మూవీగా ఫీలయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
జవాన్ కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.మరోవైపు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండటం గమనార్హం.
సినిమాలో నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ అదుర్స్ అనేలా ఉండగా అనుష్క ఈజ్ బ్యాక్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
క్లాస్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది.క్లీన్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఏ సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ బాగానే ఉంది.
ఈ వీకెండ్ కు యాక్షన్ మూవీ చూడాలనుకునే ప్రేక్షకులకు జవాన్ మంచి ఆప్షన్ కాగా క్లాస్ మూవీ చూడాలనే ప్రేక్షకులకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బెస్ట్ ఆప్షన్ గా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయి.ఈ రెండు సినిమాలలో చిన్న చిన్న మైనస్ లు తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో మైనస్ లు లేవు.