సినిమానా రాజకీయమా ? ఎటూ తేల్చుకోలేకపోతున్న పవన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై మొదటి నుంచి అనేక ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు అన్నట్లుగా తయారైంది.జనసేన పార్టీతో జనాల్లోకి వెళ్లి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు.

 Pavan Is Unable To Deside On The Politics Of Movies, Janasena, Pawan Kalyan, Six-TeluguStop.com

కానీ ఆశించిన స్థాయిలో జనసేనకు ఆదరణ దక్కలేదు.కోట్లాది మంది అభిమానుల అండదండలు, తన సామజిక వర్గం మద్దతు ఇలా అన్నీ ఉన్నా ఓటమి చెందుతామని పవన్ ఊహించలేకపోయారు.

అయినా పవన్ మాత్రం ఏదో రకంగా జనసేనను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన బిజేపితో పొత్తు పెట్టుకుని పార్టీని పరుగులు పెట్టించాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.

కానీ పవన్ విషయంలో బిజెపి వ్యవహరిస్తున్న తీరు ఒక పట్టాన అర్థం కావడం లేదు.

ఒక్కోసారి ఆ పార్టీకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తూ, చాలా సందర్భాల్లో పార్టీని పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తూ వస్తున్న తీరు జనసైనికులకు సైతం ఆగ్రహం కలిగేలా చేస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో బలం, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇబ్బందులు పడేకంటే సొంతంగానే పార్టీని బలోపేతం చేయాలనే ప్రతిపాదనలు పవన్ కు వస్తున్నాయి.ఈ కన్ఫ్యూజన్ లో ఉండగానే, ఒకపక్క సినిమా ఆఫర్లు పవన్ కు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ఓ ఆరు వరకు సినిమాలకు పవన్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కొంత కాలం పాటు పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో పార్టీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న మళ్లీ మొదటికి వచ్చింది.పూర్తిగా సినిమాలవైపు వెళ్ళిపోతే, పార్టీ పరిస్థితి.

దీంతో ఒక వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలు అంటూ పవన్ రెండు పడవలపై కాళ్లు వేసినా, అది ఇబ్బందికరమే.ఈ విషయం పవన్ కు బాగా తెలుసు గతంలో ఈ తరహా విధానంతోనే వ్యవహరించడంతో పార్టీ కి ఈ పరిస్థితి వచ్చిందనే విషయం పవన్ కు అర్థమైంది.

ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది.సినిమాల్లో యాక్టివ్ అవ్వాలా, లేక రాజకీయాల్లోనే పూర్తిగా యాక్టివ్ అవ్వలనే విషయంలో పవన్ క్లారిటీ కి రాలేకపోతున్నారు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపిస్తూ, ప్రజల్లోకి బలంగా వెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పూర్తిచేయడం వంటి వ్యవహారాలపై దృష్టి పెట్టాలని పవన్ కు సూచనలు వస్తున్నా సినిమాలను వదులుకునేందుకు ఇష్టపడడం లేదు.ఈ తరుణంలో జనసేన- సినిమాలు ఈ రెండు విషయాల్లో ఎందులో యాక్టివ్ గా ఉండాలి అనే విషయంలో పవన్ క్లారిటీ కి రాలేకపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube