రూ. 50 లక్షలతో తెరకెక్కిన జంబ లకిడి పంబ.. ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?

ఈవీవీ సత్యనారాయణ.తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ సినిమాలకు పెట్టింది పేరు.

 Jamba Lakidi Pamba Movie Collections , Jamba Lakidi Pamba, Movie Collections, Na-TeluguStop.com

ఆయన తీసిన సినిమాల్లో అన్నీ జనాలను అద్భుతంగా నవ్వించినవే.భార్య భర్తల సంబంధాలకు సంబంధించి వచ్చిన సినిమాలన్నీ జనాలను బాగా ఆకట్టుకున్నవే.

ఆయన ప్రస్తుతం జీవించి లేకున్నా.తను తీసిన సినిమాలను ఈతరం జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

 Jamba Lakidi Pamba Movie Collections , Jamba Lakidi Pamba, Movie Collections, Na-TeluguStop.com

ఆయన తెరకెక్కించిన అద్భుత సినిమా జంబ లకిడి పంబ.ఈ సినిమా 1992లో వచ్చింది.

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ సినిమా రికార్డులు బద్దులు కొట్టింది.ఈ సినిమాకు డివివి దానయ్య, గోపీనాథ్ నిర్మాతలుగా చేశారు.

అయితే ఈ సినిమాను 50 లక్షల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తే. 2 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం కలిగించింది.

వాస్తవానికి ఈ కథను ఈవీవీ ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక కోసం రాశాడు.దీన్ని అచ్చు వేయించేందుకు ఆ పత్రిక కార్యాలయానికి వెళ్లాడు.దీన్ని కూడా పత్రికలో వేస్తారా? అంటూ ఆ కథను తిప్పి పంపించారట.దీంతో తాను ఓ పొజిషన్ లోకి వచ్చాక సినిమా చేయాలి అనుకున్నాడట.

కొద్ది రోజుల తర్వాత తను సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుని.అదే కథతో సినిమా తీశాడు.

ముందుగా ఈ సినిమాలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ అనుకున్నా డేట్స్ ఖాళీగా లేక నరేష్ ను తీసుకున్నారు.హీరోయిన్ గా ఆమనిని ఓకే చేశారు.

కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, బాబు మోహన్ సహా పలువురు ఇండస్ట్రీలోని కమెడియన్లను ఈ సినిమాలో తీసుకున్నారు. మగాళ్లు ఆడాళ్లలా.

ఆడాళ్లు మగాళ్లలా మారి సినిమాలో వారు చేసే వింతలు అద్భుతం అనిపించాయి.

వాస్తవానికి ఈ సినిమా చాలా తక్కువ ఖర్చుతో తెరకెక్కించారు.సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేశారు.నిర్మాతలు ఈవీవీపై నమ్మకంతో ఈ డబ్బులు పెట్టారు.

కానీ ఊహించని రీతిలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది.వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ.2 కోట్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టింది.నాటి నుంచి నేటి వరకు తెలుగు జనాలను అద్భుతంగా ఆకట్టుకుంటూనే ఉంది ఈ సినిమా.

Jamba Lakidi Pamba Movie Collections , Jamba Lakidi Pamba, Movie Collections, Naresh, Rs. 50 Lakhs, 2 Crore, Kota Srinivasa Rao, Brahmanandam, Ali, Babu Mohan -

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube