జక్కన్న ప్లాన్.. వాళ్లని భయపెడుతుంది?

త్రిబుల్ ఆర్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన చర్చ జరుగుతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కొంతమంది అనుకుంటే.

 Jakkanna Rajamouli Plan Is Scary For Tollywood Details, Rajamouli, Rajamouli Dec-TeluguStop.com

ఏంట్రా బాబు ఈ సినిమాతో కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు అని మరికొంతమంది అనుకుంటున్నారు.ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎవరికీ క్లారిటీ లేకుండా పోతుంది.

ఒకవేళ విడుదల తేదీని ప్రకటించినప్పటికీ పక్కాగా విడుదల అవుతుంది అని నమ్మకం ఎవరిలో ఉండటం లేదు.అయితే ఇటీవలే జనవరి 7వ తేదీన విడుదల చేస్తామని త్రిబుల్ ఆర్ చిత్రబృందం ప్రకటించింది.

దీంతో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయ్.కానీ ఎవరూ ఊహించని విధంగా విడుదలకు కొన్ని రోజుల ముందు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.దీంతో అందరూ షాక్ అయ్యారు.త్రిబుల్ ఆర్ విడుదల వాయిదా తో మళ్లీ అందరిలో కన్ఫ్యూజన్ పెరిగిపోయింది.

ఎందుకంటే ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించారు.కానీ త్రిబుల్ ఆర్ రంగంలోకి దిగింది అంటే అన్ని సినిమాలు వాయిదా వేసుకోక తప్పదు.

దీంతో ఎన్నో సినిమాలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి.అటు మార్చ్ 18 లేదా 28వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని 2 విడుదల తేదీలను ప్రకటించింది జక్కన్న టీం.

Telugu Ghani, Pakka, Radhe Shyam, Rajamouli, Ram Charan, Rrr Dates, Tollywood-Mo

అయితే ఇది త్రిబుల్ ఆర్ అభిమానులకు మంచి వార్త అయినప్పటికీ మిగతా సినిమాలకు చిరాకు తెప్పించే వార్త అని చెప్పాలి.అయితే ఇలా రెండు విడుదల తేదీలను ప్రకటించడం మాత్రం ఎంతోమందికి చిరాకు తెప్పిస్తుందట.ఎందుకంటే త్రిబుల్ ఆర్ మార్చ్ 18వ తేదీన విడుదల అయితే ఇక ఆ తేదీన రిలీజ్ కావాల్సిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటో అన్నది అయోమయంలో పడిపోయింది.మార్చి 18న వరుణ్ తేజ్ గని, గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఇక కుదిరితే రాధేశ్యామ్ సినిమాని కూడా మార్చి 18 న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

Telugu Ghani, Pakka, Radhe Shyam, Rajamouli, Ram Charan, Rrr Dates, Tollywood-Mo

ఇక మరోవైపు మార్చ్ 28న నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఎఫ్ 3 లాంటి సినిమాలు రిలీజ్ చేసేందుకు కూడా ఇప్పటికే విడుదల తేదీలు అనౌన్స్ చేశారు.ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాకి 2 రిలీజ్ డేట్స్ ప్రకటించడంతో మాత్రం అందరి లెక్కలు తారుమారయ్యాయి.

ఇప్పటికే ఎన్నో సినిమాలు సమ్మర్లో రిలీజ్ అవుతుంటే ఒక రిలీజ్ డేట్ కె దిక్కులేదు అనుకుంటున్న సమయంలో ఏకంగా 2 రిలీజ్ డేట్ లను ప్రకటించి మిగతా సినిమాలకు త్రిబుల్ ఆర్ ఇబ్బందులు సృష్టిస్తోంది అనే టాక్ ఉంది.

ఇక రానున్న రోజుల్లో రాజమౌళి ప్రకటించిన విడుదల తేదీల కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది.ఏం జరుగుతుందో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube