ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు ఎలాంటి సందేహం అవసరం లేకుండా హనుమాన్( Hanuman ) మూవీ పేరును సమాధానంగా చెప్పవచ్చు.బడ్జెట్ కలెక్షన్ల లెక్కల ప్రకారం ఈ సినిమాను మించిన సినిమా ఈ ఏడాది రిలీజ్ కాలేదని చెప్పవచ్చు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ( Directed Prashanth Verma ) ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే హనుమాన్ మూవీ మరో ఎత్తు అని చెప్పవచ్చు.అయితే హనుమాన్ క్లైమాక్స్ ను మించేలా జై హనుమాన్ తెరకెక్కిందని తెలుస్తోంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ తన కామెంట్లతో హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్( Jai Hanuman ) పై అంచనాలను పెంచేశారు.హనుమాన్ మూవీ క్లైమాక్స్ ను మించి జై హనుమాన్ ఉంటుందని ఆయన వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమాకు 50 రోజుల కార్యక్రమం జరిగి చాలా రోజులైందని ఆయన అన్నారు.ఇన్నేళ్ల తర్వాత హనుమాన్ కు 50 రోజుల వేడుక జరగడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఒక సినిమా విజయం చాలామంది జీవితాలను మారుస్తుందని హనుమాన్ మా మొత్తం టీంకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆయన వెల్లడించారు.హనుమాన్ రీమాస్టర్ వెర్షన్ తీసుకొస్తున్నామని త్వరలో విదేశీ భాషల్లో సైతం ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.త్వరలో జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.హనుమాన్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో జై హనుమాన్ రెండున్నర గంటల పాటు అదే థ్రిల్, జోష్ తో ఉంటుందని ప్రశాంత్ వర్మ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 330 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.త్వరలో జీ5 ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.