సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) ఒకరు. చిత్రం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈయన వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయారు.
ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఉదయ్ కిరణ్ కు క్రమంగా అవకాశాలు తగ్గిపోయే దాంతో ఈయన మానసికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఇక ఉదయ్ కిరణ్ మరణానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాలు తెలియదు కానీ ఈయన మరణం గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.అయితే తాజాగా ఉదయ్ కిరణ్ మరణం గురించి జబర్దస్త్ కమెడియన్ ( Jabardadth Comedian ) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా చేసినటువంటి వారిలో శేకింగ్ శేషు( Shaking Seshu ) ఒకరు.ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో తనకు సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ నుంచి తప్పుకుని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.వరుస సినిమాలలో అవకాశాలు రావడంతో నేను చాలా బిజీగా ఉన్నానని తెలిపారు.కానీ ఇటీవల కాలంలో నాకు ఒక్కరు కూడా అవకాశాలు ఇవ్వలేదని దాంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు.
ఈ ఇబ్బందుల కారణంగా కొన్నిసార్లు చనిపోవాలని ఆలోచనలు కూడా వస్తున్నాయని ఈయన తెలిపారు.ఇక ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ చావుకు ఇలా అవకాశాలు ఇవ్వలేని వారు కూడా కారణం అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.