సినిమా పేరునే ఇంటి పేరు గా మార్చుకొని ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్( Allari naresh )…ఈయన చాలా సినిమా ల ప్లాప్ తర్వాత నాంది అనే సినిమా తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన మనందరికీ తెలిసిందే… ఇక ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా కూడా చేశాడు.అది మంచి సినిమా అనిపించుకుంది కానీ మంచి సక్సెస్ అయితే కాలేకపోయింది.
ఇప్పుడు మళ్ళీ నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో( Vijay kanakamedala ) కలిసి ‘ఉగ్రం’( Ugram ) అనే చిత్రం చేశాడు.ఇది పక్కా యాక్షన్ మూవీ.
మే 5న ఈ చిత్రం విడుదల అయ్యింది.‘lషైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది( Sahu Garapati,Harish peddi ) కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు…
మిర్నా మీనన్( Mirnaa ) హీరోయిన్ గా నటించింది.ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు మరో కొత్త అల్లరి నరేష్ ను పరిచయం చేసిందని చెప్పాలి.ఇక రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.
దీంతో మొదటి వీకెండ్ జస్ట్ యావరేజ్ అనిపించుకుంది.వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాణించడం లేదు.ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే ఉగ్రం చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.52 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.48 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాణించలేకపోతుంది అనే చెప్పాలి…
ఇక ఈ వీక్ లో నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన కస్టడీ సినిమా వస్తుంది ఇక ఈ సినిమా మీద జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం జనాలు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…ఈ సినిమా వచ్చిందంటే ఇక ఉగ్రాం సినిమా కలెక్షన్స్ క్లోజ్ అయినట్టే…
.