సినిమాలే వద్దనుకున్న అక్కినేని అమల హీరోయిన్ కావడానికి కారణమిదే?

సినిమా నటిగా, జంతు సంక్షేమ కార్యకర్తగా అక్కినేని అమల తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారనే విషయం తెలిసిందే.అమల తండ్రి బెంగాళీ కాగా తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు కావడం గమనార్హం.తెలుగులో చినబాబు సినిమాతో తమిళంలో వైశాలి సినిమాతో అమల కెరీర్ ను మొదలుపెట్టారు.1993 సంవత్సరంలో అమల, నాగార్జునల వివాహం జరిగింది.ఈ జంటకు 1994 సంవత్సరంలో అఖిల్ జన్మించారు.

 Interesting Facts About Star Heroine Amala Career , Amala  , Tollywood ,  Heroin-TeluguStop.com

చాలామంది హీరోయిన్లు ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చారు.అయితే అమల మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి రావాలని భావించలేదు.మద్రాస్ లో అమల కళాక్షేత్రలో చేరి బి.ఎఫ్.ఏ పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా నాట్య ప్రదర్శనలను ఇచ్చారు.కళాక్షేత్రలో ఉన్న సమయంలో సినిమాలు చేయడం కూడా వీలు కాదు.సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో అమల గారు మొదట భయపడ్డారు.

Telugu Akhil, Amala Akkineni, Kalakshetra, Offers, Nagarjuna-Movie

అయితే దర్శకులు కన్విన్స్ చేసి అక్కినేని అమలను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశారు.ఆ తర్వాత తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా అమల నటించారు.అమల నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి.నాగార్జునతో పెళ్లి తర్వాత నాగ్ అమల మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు.అమల రీఎంట్రీలో పరిమితంగా సినిమాలలో నటిస్తూ విజయాలను అందుకుంటున్నారు.

Telugu Akhil, Amala Akkineni, Kalakshetra, Offers, Nagarjuna-Movie

బుల్లితెరపై అమల కొన్ని సీరియళ్లలో నటించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమాలో అమల నటిస్తున్నారు.మనం సినిమాలో అమల గెస్ట్ రోల్ లో నటించారు.

అయితే అమలను అభిమానించే అభిమానులు మాత్రం కోట్ల సంఖ్యలో ఉన్నారు.పాత్ర నచ్చితే మాత్రమే అమల రీఎంట్రీలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

అరుదైన వ్యక్తిత్వం ఉన్న అమల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube