ప్రభాస్ తండ్రి గురించి ఎవరికి తెలియని రహస్యాలు.. అప్పట్లో అచ్చం ప్రభాస్‌లానే అయన కూడా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగ్రేటం చేశారు.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Interesting Facts About Prabhas Father Surya Narayana Raju Details-TeluguStop.com

బాహుబలి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రభాస్ వ్యక్తిగత విషయానికి వస్తే ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.ఇలా ప్రభాస్ కృష్ణంరాజు ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని ప్రతి ఒక్కరు భావిస్తారు.

 Interesting Facts About Prabhas Father Surya Narayana Raju Details-ప్రభాస్ తండ్రి గురించి ఎవరికి తెలియని రహస్యాలు.. అప్పట్లో అచ్చం ప్రభాస్‌లానే అయన కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ నిజానికి ప్రభాస్ తండ్రికి కూడా సినిమా ఇండస్ట్రీతో ఎన్నో అనుబంధాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.ప్రభాస్ తండ్రి పేరు సూర్య నారాయణ రాజు.

అప్పట్లో ఈయన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.సూర్యనారాయణ రాజు తన అన్నయ్య కృష్ణంరాజుకు అండగా ఉంటూ గోపి మూవీస్ పతాకంపై కృష్ణంరాజు నటించిన చిత్రాలను నిర్మించే వారు.

ఈ విధంగా ప్రభాస్ తండ్రి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన సమయంలో ప్రభాస్ ను హీరోగా పరిచయం చేయాలని ఎన్నోసార్లు భావించారు.

Telugu Eeswar Movie, Father, Grand Father, Hero, Interesting Facts, Krishnam Raju, Prabhas, Prabhas Father, Prabhas Pan India Range, Secreats, Surya Narayana Raju, Tollywood-Movie

అయితే ప్రభాస్ అందుకు ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు.ఈ క్రమంలోనే తన పెదనాన్న కృష్ణంరాజుకి కొడుకులు లేకపోవడంతో తన వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించి ప్రభాస్ ను ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశారు.అలా వెండితెరపై ఇష్టం లేకుండా అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఇండియా స్థాయి హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది సమయానికి బాహుబలి వంటి చిత్రంలో నటించి పాన్ ఇండియా స్థాయి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం సినీ కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారు ప్రభాస్.

Telugu Eeswar Movie, Father, Grand Father, Hero, Interesting Facts, Krishnam Raju, Prabhas, Prabhas Father, Prabhas Pan India Range, Secreats, Surya Narayana Raju, Tollywood-Movie

అయితే ప్రభాస్ ఈ రేంజ్ లో ఉన్న ఆనందాన్ని పొందడానికి, అతని గుర్తింపును చూసి గర్వపడటానికి ప్రస్తుతం ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు ఈ లోకంలో లేరు.ప్రభాస్ స్టార్ హీరోగా ఎదుగుతున్న రోజుల్లోనే తన తండ్రి సూర్యనారాయణ రాజు మరణించడం ప్రభాస్ కి తీరని లోటుగా ఉండిపోయింది.

అయితే ప్రస్తుతం ప్రభాస్ లుక్స్ ఒకప్పుడు తన తండ్రి పోలికలతో ఉండేవి.

ప్రభాస్ అచ్చం తన తండ్రి పోలికలను కలిగి ఉన్నారని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి ఫోటోను తన తండ్రి ఫోటోతో పోలుస్తూ ఈ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున వైరల్ చేశారు.

ఇవి చూసిన ప్రభాస్ అభిమానులు ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

#Grand Father #Prabhas Father #Father #Prabhas #Eeswar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు