వెంకటేష్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఈతరం ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా విడుదలై 21 సంవత్సరాలైనా ఇప్పటికీ టీవీలలో ఈ సినిమా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.అయితే ఈ సినిమాలో మొదట హీరోగా తరుణ్ పేరును మేకర్స్ పరిశీలించారు.
నిర్మాత స్రవంతి రవికిషోర్ నువ్వే కావాలి సక్సెస్ తర్వాత త్రివిక్రమ్, విజయ భాస్కర్ కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్ చేశారు.
మంచి కథ చెప్పమని అడిగితే త్రివిక్రమ్, విజయ భాస్కర్ ఈ కథను చెప్పారు.
తరుణ్ తో తీయాలని స్రవంతి రవికిషోర్ భావించగా ఆ సమయంలో సురేష్ బాబు తన దగ్గర వెంకటేష్ డేట్స్ ఉన్నాయని స్రవంతి రవికిషోర్ కు చెప్పారు.ఆ తర్వాత విజయభాస్కర్, త్రివిక్రమ్ వెంకటేష్ కు కథ చెప్పి ఒప్పించడం వాళ్లిదరూ వెంటనే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించడం జరిగింది.
ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిష, గజాలా పేర్లను పరిశీలించడం జరిగింది.
కానీ ఆ హీరోయిన్ల కంటే వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ బాగుంటుందని భావించి చివరకు ఆమెను ఫైనల్ చేశారు.
సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర కోసం మొదట నాజర్ పేరును పరిశీలించి ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ను ఎంపిక చేశారు.తరుణ్, త్రిష పరోక్షంగా మిస్ చేసుకున్న ఈ సినిమా వెంకటేష్, ఆర్తి అగర్వాల్ లకు సక్సెస్ ను అందించింది.
ఈ సినిమాలో బ్రహ్మానందం సీన్స్ ను మిస్టర్ బీన్ స్పూర్తితో తెరకెక్కించారు.
ఈ సినిమాకు కోటి అందించిన పాటలు ఊహించని స్థాయిలో ప్లస్ అయ్యాయి.దాదాపుగా మూడు గంటల నిడివితో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించింది.త్రివిక్రమ్ కామెడీ పంచ్ లకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.3 కేంద్రాలలో ఈ సినిమా 175 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కవిత చెప్పే సీన్ ను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.