మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న భార్యభర్తలు ఎంతోమంది ఉంటారు.అయితే ఒకే సమయంలో భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అరుదుగా జరుగుతుంది.
ఖమ్మం జిల్లాలోని( Khammam District ) తల్లాడ మండలం గోపాలరావుపేటకు చెందిన కందుల అప్పారావు,( Kandula Apparao ) కందుల కల్పన( Kandula Kalpana ) తాజాగా విడుదలైన గురుకుల బోర్డ్ ఫలితాలలో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం గమనార్హం.భర్త అప్పారావుకు ట్రైబల్ వెల్ఫేర్ లో ఫిజికల్ డైరెక్టర్ జాబ్ రాగా భార్య కల్పనకు బీసీ వెల్ఫేర్ జాబ్ వచ్చింది.
ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కల్పన, అప్పారావు జాబ్ ఆఫర్ లెటర్లను సొంతం చేసుకున్నారు.చాలా సంవత్సరాలుగా ప్రైవేట్ టీచర్లుగా పని చేస్తున్న కల్పన, అప్పారావు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యుల, గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.12 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న ఈ దంపతుల కష్టాలు తీరినట్టేనని నెటిజన్లు చెబుతున్నారు.
ఎంతో కష్టపడి పరీక్షల కోసం ప్రిపేర్ కాగా ఆలస్యంగా ఈ దంపతుల కష్టానికి ఫలితం దక్కిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.కల్పన, అప్పారావు( Kalpana, Apparao ) దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా ఎంతో కష్టపడి ఈ జంట పిల్లలను చదివిస్తున్నారు.కందుల అప్పారావు, కల్పన ప్రభుత్వ ఉద్యోగాలు( Government Jobs ) సాధించడం ద్వారా తమ కలను నెరవేర్చుకున్నారు.
అప్పారావు, కల్పన సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలు రాసి అప్పారావు, కల్పన మెరుగైన ఉద్యోగాలు సాధించి కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అప్పారావు, కల్పన సరైన ప్రణాళికతో ప్రిపేర్ కావడం వల్లే సులువుగా లక్ష్యాన్ని సాధించడం సాధ్యమైందని సమాచారం అందుతోంది.అప్పారావు, కల్పన ప్రతిభను ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.