ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ మేరకు ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.ప్రజాధనం ఎంత వృధా అయిందో వివరాలు తెలపాలని కోర్టు సూచించింది.
దీనిపై ఆర్బీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని పిటిషనర్ న్యాయస్థానికి తెలిపారు.ఈ క్రమంలో మరోసారి వివరాలు కోసం దరఖాస్తు చేయాలని కోర్టు సూచించింది.
అదేవిధంగా ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.