టాలెంట్( Talent ) ఉన్నవాడు ఎలాగైనా బ్రతకగలడని అందరూ చెబుతారు.అలాగే ఒకచోట కాకపోయినా మరొచోటకు వెళ్లైనా తమ ప్రతిభతో జీవించవచ్చని మనలో చాలామంది చెబుతూ ఉంటారు.
కూటి కోసం కోటి విద్యలు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సామెతలు బాగా పనిచేస్తాయి.
ఎందుకంటే అన్ని దేశాల్లోనే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందింది.దీంతో టెక్నాలజీ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే ఒక దేశంలో కాకపోయినా మరో దేశంకు వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చు.
ఇటీవల చాలా టెక్ కంపెనీలు లేఆఫ్ ప్రకటించాయి.ప్రపంచంలోనే పెద్ద కంపెనీలైన అమెజాన్, ఫేస్బుక్, టీసీఎస్, ట్విట్టర్, మెటా లాంటి కంపెనీలు వేలమంది ఉద్యోగులను తీసివేశాయి.ఇండియాలో కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు.అయితే ఇండియా టెక్ జాబ్ మార్కెట్ మాత్రం నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు( Skilled Professionals ) ఆశాజనకంగా ఉందని టెక్ కంపెనీ బోట్ సహా వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ సమీర్ మెహతా( Sameer Mehta ) తెలిపారు.
అాలాగే డాల్బీ లేబొరేటరీస్ లోని ఐఎమ్ఈఏ సీనియర్ డైరెక్టర్, కమర్సియల్ పార్టనర్షిప్ కరణ్ గ్రోవర్( Karan Grover ) కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు.
అవసరమైన అనుభవం, నైపుణ్యం ఉన్నవారికి బోలెడంత అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.అయితే టెక్ మార్కెట్ హైక్వాలిటీ టాలెంట్‌ను కోరుకుంటుందని, హైక్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్‌కి ఉద్యోగులకు ఎప్పుడూ ఢోకా ఉండదని తెలిపారు., స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వివిధ డొమైన్లలో రాణించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
నైపుణ్యం ఉన్నవారికి సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయని, ఉద్యోగాల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సమీర్ మెహతా, కరణ్ గ్రోవర్ చెప్పుకొచ్చారు.కంపెనీలు మంచి నైపుణ్యం కలిగినవారి కోసం చూస్తున్నాయని, వారి కోసం రెడ్ కార్పెట్ వేచి ఉంటుందన్నారు.