ఏఐ బేస్డ్ డీజే.. ప్రపంచంలోనే మొట్టమొదటి రేడియో స్టేషన్..

టెక్నాలజీ వేగంగా వృద్ధి చెందుతోంది.రోజుకో కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది.

 Ai Based Dj.. World's First Radio Station.. Ai Based , Technology Updates, Techn-TeluguStop.com

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం బాగా పెరిగిపోతోంది.ప్రతి రంగంలోనూ ఏఐ బాగా ఉపయోగపడుతుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence )వ్యవస్థతో నడిచే చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా పనులు సులువవుతున్నాయి.ఛాట్ జీపీటీతో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి గత కొంతకాలంగా తెగ చర్చ జరుగుతోంది.

ఛాట్ జీపీటీ( Chat GPT )తో మానవాళికి ముప్పు ఏర్పడనుందని చెబుతున్నారు.

Telugu Ai, Alpha, Chat Gpt, Ups, Worlds Radio-Latest News - Telugu

అయితే తాజాగా ఏఐ ప్రపంచంలోనే మరో సంచలనం చోటుచేసుకుంది.ఏఐ ఆధారిత డిస్క్ జాకీని ప్రవేశపెట్టారు.యూఎస్ రేడియో స్టేషన్‌లో ఈ డిస్క్ జాకీని పెట్టారు.ఆల్పా మీడియా( Alpha Media ) యాజమాన్యంలోని యూఎస్ రేడియో స్టేషన్ కేబీఎఫ్‌ఎఫ్ లైవ్ 95.5 ఎఫ్ రేడియోలో తొలి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీజేను అభివృద్ధి చేశారు.దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ బేస్డ్ డీజేను ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్‌గా గుర్తింపు పొందింది.మిడ్ డే హోస్ట్ యాప్లే ఎల్జింగాకి ఏఐ వెర్షన్ ను అభివృద్ధి చేయడానికి పూట్రీ మీడియాకు సంబంధించిన రేడియోజీపీటీ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

Telugu Ai, Alpha, Chat Gpt, Ups, Worlds Radio-Latest News - Telugu

ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీజే ఇప్పుడు రేడియో స్టేషన్ ( AI DJ radio station )లో మధ్యాహ్న ప్రదర్శనను నిర్వహిస్తోంది.ప్రముఖ వార్త సంస్థ ఫాక్స్ న్యూస్ దీనికి సంబంధించిన వార్తను ప్రచురించింది.అయితే డీజే రేడియోలు, పార్టీలు, క్లబ్‌లు, కచేరీల వంటి ఈవెంట్ లలో రికార్డ్ చేసిన సంగీతాన్ని ప్లే చేస్తారు.

పాటలను మిక్స్ చేయడం, అదిరిపోయే మ్యూజిక్ ను కంటిన్యూగా ప్లే చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.కానీ ఇప్పుడు ఏఐ డీజే సులభంగా ఈ పనులను నిర్వర్తిస్తుంది.

ఈ రేడియోజీపీటీ సాఫ్ట్ వేర్ కంటెంట్ క్రియేటర్లను వివిధ మార్గాల్లో ప్రెజెంట్ చేయడానికి ఉపయోగపడుతుందని అప్పా మీడియా కంటెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫిల బెకర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube