భారత టెకీ లలో మొదలైన సెప్టెంబర్ -11 టెన్షన్

అమెరికా ప్రభుత్వం హెచ్ -1 బీ వీసా విధానంలో చేసిన కీలక మార్పులు టెకీ లపై తీవ్రమైన ప్రభావం చూపనుంది అనే విషయం తెలిసిందే అయితే అమెరికాకి ఉద్యోగరిత్యా వెళ్ళిన ఎంతో మంది విదేశీయులకి టెకీ లకి ఈ పరిణామాలవలన తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది…అంతేకాదు ఇప్పటికే హెచ్ -1 బీ వీసా కలిగిన వారు సైతం తమ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని ఎదో ఒక కారణంతో రిజెక్ట్ చేయించి మరీ శాశ్వతంగా వారిని స్వదేశాలకి పంపాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే గతంలో వీసా గడువు అవ్వగానే 210 రోజులు వెసులుబాటు ఇచ్చేవారు

 Indian Nris Tension About September 11 Visa Planes-TeluguStop.com

అయితే ఈ తరహా అవకాశం.

సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఐటీ ఉద్యోగులకు ఇలాంటి ఏ వెసులుబాటూ ఉండదు.అమల్లోకి రానున్న కొత్త రూల్స్ లకి లోబడి వీసా పొడిగింపునకు వచ్చిన దరఖాస్తు సక్రమంగా ఉందని ఇమ్మిగ్రేషన్‌ అధికారి భావిస్తేనే ఆమోదిస్తారు.

లేదంటే తిరస్కరణ తప్పదు.గతంలో మాదిరి నోటీసుల జారీ ఉండదు.

అంతేకాదు వీసా పొడిగింపు దరఖాస్తు రిజెక్ట్ చేసిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నోటీసులు జారీ చేస్తారు.అప్పటికీ వెళ్లకపోతే పదేళ్ల పాటు అమెరికా రాకుండా బహిష్కరిస్తారు.

అంతేకాదు గతంలో మాదిరి ఆ సమయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఉద్యోగం చేయడానికి అర్హుడు కాడు… హెచ్‌1బీ వర్క్‌ వీసా కింద పని చేస్తూ పొడిగింపు అనుమతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగికి ఇమ్మిగ్రేషన్‌ విభాగం కారణం చెప్పకుండా ఎన్‌టీఏ జారీ చేసి.అతడిని ఉద్యోగం నుంచి తప్పించాలని కంపెనీని ఆదేశించేలా ఒక నిభంధానని కూడా ఇటీవల యూఎస్‌సీఐఎస్‌ అమల్లోకి తీసుకుని వచ్చింది అంటే అమెరికా అంచెలంచెలుగా తన వ్యుహాలని అమలు చేస్తోంది.

ఇదిలాఉంటే అమెరికా ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ కొత్త రూల్స్ వలన అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ ఏడాది ఈ కంపెనీలకు జారీ చేసిన వర్క్‌ పర్మిట్‌ వీసాలు కేవలం 12 శాతం.

అదే అమెరికన్‌ కంపెనీల విషయంలో పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో వారు లబ్ధి పొందుతున్నారు.పెద్ద ఎత్తున ఆర్డర్లు చేతిలో ఉన్నా భారతీయ కంపెనీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి…దాంతో ఆ కంపెనీలకి మాత్రమె కాకుండా ఏంటో మంది భారతీయ ఐటీ నిపునులపై తీవ్రమైన ప్రభావం పడే సూచనలు కూడా ఉన్నాయని ఐటీ పరిశీలకులు ఆవేదన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube