బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్( Bollywood Actress Kareena Kapoor ) గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుకోవడమే కాకుండా సినిమాలలో తన అందం,అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేసింది.
కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కరీనాకపూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సూచన మీడియాలో కరీనాకపూర్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.
కరీనాకపూర్ సాధించిన ఘటనలకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
కాగా బాలీవుడ్‌లో కరీనా కపూర్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయన్న విషయం మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ చరిత్ర( Bollywood )లో మరే ఇతర హీరోయిన్ల సినిమాలు ఆమెను అధిగమించ లేకపోయాయి.అంతలా ఆమె చిత్రాలు సక్సెస్ సాధించాయి.కరీనా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.4 వేల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయంటే ఆమె రేంజ్ ఏంటో అర్థమవుతోంది.ఆమె నటించిన 23 సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్( Kareena Kapoor Super Hit Movvies ) చూస్తే బాలీవుడ్ స్టార్స్ కరిష్మా, కత్రినా, రాణి ముఖర్జీ, కాజోల్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే సైతం దారిదాపుల్లో కూడా లేరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
కరీనా నటించిన 23 చిత్రాల్లో బజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.బజరంగీ భాయిజాన్( Bajrangi Bhaijaan ) ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా రూ.918 కోట్లు వసూలు చేసింది.అలాగే కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, జబ్ వి మెట్, బాడీగార్డ్, గుడ్ న్యూజ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి.వీటితో పాటు మరికొన్ని సూపర్ హిట్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.4000 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాయి.దక్షిణాదిలో హీరోయిన్లతో పోలిస్తే సమంత, నయనతార, అనుష్క శెట్టి సినిమాలకు సైతం ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రాలేదు.అయితే కరీనా తర్వాత రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోయిన్లలో దీపికా పదుకొణె, అనుష్క శర్మ ఉన్నారు.దక్షిణాదిలో అయితే అనుష్క శెట్టి, తమన్నా భాటియా బాహుబలి చిత్రంతో ఈ జాబితాలోకి వచ్చారు.