పెరిగిన నీటి మట్టం.. పొంగుతున్న వరద !

వర్షం ఆగకుండా కురుస్తుండటంతో గోదావరి నదిలో వరద పొంగుతోంది.వరద ఉధృతి పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది.

 Bhadrachalam, Godavari, Water, Increase-TeluguStop.com

పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, నార్త్ స్టేట్ ల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది.మంగళవారం రాత్రి 25 అడుగులున్న నీటి మట్టం బుధవారం మధ్యాహ్నానికి 29.5 అడుగులకు పెరిగింది.రాత్రి వరకు 30 అడుగులు, గురువారం ఉదయానికి నీటిమట్టం 32 అడుగులకు దాటింది.

భద్రాచలం పరిసర ప్రాంతాల్లో, క్యాచ్ మెంట్ ఏరియాల్లో వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో వరద ఉధృతి అధికమవుతోంది.గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.వరద నీరు చేరి నీటిమట్టం పెరగడంతో తాలిపేరు డ్యాం నుంచి 17,626 క్యూసెక్కులు, కిన్నెరసాని డ్యాం నుంచి 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు అధికారులు.దీంతో గోదావరి దిగవ తీర ప్రాంతాల్లో నివసించే గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.

గోదావరితో ఏపీ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు పరిస్థితి కూడా అలానే ఉంది.పోలవరం నీటి మట్టం 10.610 మీటర్లు ఉండగా.గోదావరి వరద కారణంగా కాపర్ డ్యాంలో నీటి మట్టం పెరిగి 24.75 మీటర్లకు పెరిగింది.వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు స్తంభించిపోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube