ఏపీలో అధికార పార్టీగా వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది.
ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను సీఎం జగన్ నియమించారు.తాజాగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇంఛార్జ్ ల మార్పుపై రెండో లిస్టును ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాతో పాటు రాయలసీమ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.