ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు నిజంగానే దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి.ఆరోగ్య శ్రీ నుంచి నాడు-నేడు వరకు, వలంటీర్ వ్యవస్థ నుంచి ఇళ్ల పంపిణీ వరకు జగన్ చేస్తున్న కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జేజేలు వస్తున్నాయి.
ఇంత వరకు బాగానే ఉంది.కానీ, ఆయన చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు.
మాత్రం వాటిని యథాతథంగా అమలు చేయడం లేదని, తమకు తోచిన విధంగా, నచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది.దీంతో సదరు కార్యక్రమాల్లో పస ఉండడం లేదనే విమర్శలు వున్నాయి.
ఇవే ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయనే వాదన కూడా ఉంది.
తాజాగా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
దీనికి పెద్దగా ఖర్చుతో పనిలేదు.కానీ, ఇది అమలైతే.
మాత్రం దేశంలోనే తొలి ప్రయత్నంగా ఉంటుందని, రాష్ట్రానికి ఎంతో పేరు తేవడంతోపాటు.ప్రజల్లోనూ పార్టీకి, ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
ఇంతకీ ఈ కార్యక్రమం ఏంటంటే.ప్రతి ప్రభుత్వ వైద్య శాలలోనూ అభిప్రాయాలనుసేకరించే ప్రక్రియ.
ఆయా వైద్య శాలల్లో రోగులకు అందుతున్న సేవలు, వారికి అందిస్తున్న మందులు, ఆహారం వంటివి నాణ్యంగా ఉండాలని జగన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు.దీనికి సంబందించిన నిధులు కూడా పెంచారు.
అయినప్పటికీ.ఆ తరహాలో సేవలు మాత్రం అందడం లేదు.

ఇప్పటికీ.అనేక చోట్ల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో జగన్ ఎవరినీ బాధ్యులను చేయలేకపోతున్నారు.ఎక్కడా చర్యలు తీసుకోలేక పోతున్నారు.అలాగని వ్యవస్థను అలాగే వదిలేస్తే.ప్రభుత్వానికి, తనకు చెడ్డపేరు రావడం ఖాయమని గుర్తించి.
వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రతి ఆసుపత్రిలోనూ గ్రేడింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు.
ఆరోగ్య మిత్రలను నియమిస్తారు.ఆయా ఆసుపత్రుల్లో రోగుల కు అందుతున్న సేవల పై నేరుగా రోగుల నుంచే అభిప్రాయాలు సేకరించి.
గ్రేడింగ్ నిర్వహిస్తారు.దీనివల్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తే.
స్టార్ రూపంలో తమ ర్యాంకు ఇవ్వొచ్చు.
లేకపోతే.
ఆరోగ్య మిత్రల వద్ద ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.ఈ ప్రక్రియ ద్వారా వైద్య సదుపాయాలు మరింత మెరుగు పరిచేందుకు అవకాశం ఉంటుందని జగన్ భావన.
దీనికి ఆయన పెట్టిన సమయం 15 రోజులు.ఈ రిపోర్టు నేరుగా సీఎంవోకే అందించేలా కూడా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఈ పరిణామం మంచిదే.అయితే, క్షేత్రస్థాయిలో అర్ధం చేసుకుని.
అమలు చేసే వారిపై నే ఆధారపడి ఉండడం గమనార్హం.ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.
దేశంలో ఏ ఆస్పత్రిలోనూ ఈ తరహా గ్రేడింగ్ విధానం లేకపోవడం! మరి జగన్ ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి!
.