జపాన్ దేశస్తులు చేసే ఆవిష్కరణలు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి.తాజాగా అబ్బురపరిచే అలాంటి ఒక ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే, జపాన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఐకోమా టాటామెల్ పేరిట మడతపట్టే ఒక ఎలక్ట్రిక్ బైక్‌ను తాజాగా తీసుకొచ్చింది.మనం ఇప్పటివరకు మడత పెట్టే ఫోన్లు మాత్రమే చూశాం.
కానీ మడత పెట్టే ఒక బైక్ ఇంతవరకు చూడలేదు.
అసలు బైక్ ని ఎలా ఫోల్డ్ చేస్తారు? బైక్ ని మడత పెట్టాలని ఆలోచన ఎవరికైనా వస్తుందా అంటే అది జపాన్ వాళ్ళకి మాత్రమే సాధ్యమని చెప్పొచ్చు.వివరాల్లోకి వెళ్తే.జపనీస్ స్టార్టప్ కంపెనీ ఐకోమా అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో టాటామెల్ అనే ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ బైక్ చూపించింది.
ఆ షోలో కొన్నిసెకన్లలోనే సూట్‌కేస్-సైజులో బైక్‌ను మడత పెట్టి చూపించింది.
ఈ బైక్ ధర 4,000 డాలర్లు కాగా మన ఇండియన్ కరెన్సీలో దీని ధర దాదాపు రూ.3,30,862.అంటే ఒక ప్రీమియం బైక్ ధర అని చెప్పవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ 2024 చివరిలో కొడగోలుకు అందుబాటులోకి రానుంది.ఈ బైక్ ఫీచర్ల గురించి తెలుసుకుంటే ఇది గంటకు 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది.
ఇందులో 2,000 వాట్ల ఔట్‌పుట్‌తో 600W ఇంటిగ్రేటెడ్ మోటారు, 12 amp-hour, 51-వోల్ట్ బ్యాటరీ, యూఎస్‌బీ ఏసీ ఔట్‌పుట్ అందించారు.అంటే ఈ బైక్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ టాటామెల్ ఎలక్ట్రిక్ బైక్ టైర్లు 10-అంగుళాల పరిమాణంలో ఉంటాయి.అంటే హోండా యాక్టివా స్కూటర్ టైర్లు ఎలా ఉంటాయో దీని టైర్లు కూడా అంతే సైజులో ఉంటాయని చెప్పవచ్చు.ఇలాంటి చిన్న టైర్లు ఉన్నాయి కాబట్టే దీనిని మడతపెట్టి మంచం కింద లేదా డెస్క్ కింద ఈజీగా ఉంచవచ్చు.ఈ బైక్ బరువు కూడా చాలా తక్కువే.
కంపెనీ ప్రకారం దీని బరువు 110 పౌండ్లు (దాదాపు 50 కిలోలు). కాబట్టి ఎక్కడికంటే అక్కడికి దీన్ని మోసుకొని వెళ్లవచ్చు.