తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న షోబిగ్ బాస్.తాజా సీజన్ 5 మంచి జనాదరణతో ముందుకు సాగుతుంది.
గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ ఎంటర్ టైన్ విషయంలో కాస్త వెనుకబడి ఉన్నా రేటింగ్ లో మాత్రం మిగతా షోలకంటే ముందే ఉంది.అయితే దేశంలోని పలు భాషల్లో ప్రస్తుతం బిగ్ బాస్ షో కొనసాగుతుంది.
అన్ని చోట్లా జనాల మనుసుల్లో బాగానే చోటు సంపాదించుకుంది.అయితే ఇంతకీ ఈ బిగ్ బాస్ ఐడియా ఎలా వచ్చింది? ఎక్కడ తొలిసారి పుట్టింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ ఐడియా తొలుత అమెరికాలో పుట్టిందిఎండిమోల్ సంస్థ బిగ్ బ్రదర్అ నే టీవీ షో రూపొందించింది.ఈ షోను కాపీ కొట్టి రూపొందించిందే బిగ్ బాస్.
కొందరు సెలబ్రిటీలను సెలెక్ట్ చేసి.వారిని కొద్ది రోజుల పాటు ఒక ఇంట్లో ఉంచి.
వారి రోజు వారీ పనులను షూట్ చేసి టెలికాస్ట్ చేయడమే ఈ షో ప్రత్యేకత.ఈ హౌస్ లోకి వెళ్లేవాళ్లు సెలబ్రిటీలు కావడంతో జనాలు ఇంట్రెస్ట్ గా చూస్తారు.ఇంట్లోని సభ్యులకు రకరకాల టాస్క్ లు పెట్టి ఆడియెన్స్ ఒపీనియన్ ద్వారా ఓ వ్యక్తిని విన్నర్ గా తేలుస్తారు.విజేతలకు భారీ డబ్బు అందిస్తారు.అందుకే హౌస్ లోని సభ్యుల మధ్య గట్టి పోటీ ఉంటుంది.
అటు 2000 సంవత్సరంలో అమెరికన్ మీడియా సంస్థ సీబీఎస్ 20 మిలియన్ డాలర్లకు బిగ్ బ్రదర్ షో టెలికాస్ట్ రైట్స్ తీసుకుంది.ఈ షో బాగా హిట్ కావడంతో సుమారు 50 దేశాల్లో పలు పేర్లతో ఎండిమోల్ సంస్థ ఇదే షోను రూపొందించి టెలికాస్ట్ చేసింది.ఇండియాలో ఇదే సంస్థ ఎండిమోల్ షైన్ పేరుతో ఓ కంపెనీని రిజిస్టర్ చేయించింది.
బిగ్ బ్రదర్ పేరును కాస్త బిగ్ బాస్ గా మార్చింది.ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ భాషల్లో ప్రసారం అవుతుంది.
అన్ని చోట్ల మంచి ఆదరణ కలిగి ఉంది బిగ్ బాస్ షో.