అమీర్ పేటలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు

హైదరాబాద్ అంటే హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్స్ కి, అలాగే వ్యభిచార ముఠాలకి కొదవే ఉండదు.పోలీసులు వీటిపై ఎంతగా సీరియస్ యాక్షన్ తీసుకున్న ఈ దందాని కొనసాగిస్తున్న వారు అదే దారిలో వెళ్తున్నారు.

 Hi Tech Prostitution Racket Busted In Hyderbad Sr Nagar-TeluguStop.com

ఇలాంటి భాగోతాలు బయటపడినపుడు మళ్ళీ కొంతకాలం వీటి గురించి చర్చ నడుస్తుంది.ఆ తరువాత ఇలాంటి వ్యభిచార రాకెట్స్ నడిపేవారు మళ్ళీ అదే పంథాలో వెళ్తూ ఉంటారు.

తాజాగా అమీర్ పేట లో ఓ స్టార్ హోటల్ లో హైటెక్ వ్యభిచారం రాకెట్ ని అడ్డుకున్నారు.ప్రముఖ హోటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి నలుగురు విదేశీ యువతులతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఈ వ్యభిచార ముఠాకి సహకరించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, హోటల్‌ మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు.అలాగే పంజగుట్టలోని పోలో లాడ్జిపై దాడి చేసి ఉజకిస్తాన్‌కు చెందిన నలుగురు మహిళలతో పాటు బెంగాల్‌కు చెందిన యువతి, నలుగురు విటులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల రాకపై సమాచారం అందడంతో నిర్వాహకులు పరారైనట్లు తెలిపారు.మొత్తానికి ఈ రెండు సంఘటనలతో హైదరాబాద్ కేంద్రంగా భారీగా వ్యభిచారం ముఠాలు నడుస్తున్నాయని స్పష్టం అవుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube