సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న త్రిష చాలాకాలం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో ఈమె చోళుల రాకుమారి కుందవై పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా రాకుమారి పాత్రలో ఈమె నటించబోతున్నారని తెలియగానే ఆమె గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవడం కోసం త్రిష ఏకంగా కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల మొత్తం చదివానని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి త్రిష ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత కరోనా విజృంభించి లాక్ డౌన్ పడింది.అదే సమయంలోనే పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడంతో ఈ నవల ఐదు భాగాలను తాను క్షుణ్ణంగా చదివి ప్రతి ఒక్క పాత్రను ఎంతో అద్భుతంగా అర్థం చేసుకున్నానని తెలిపారు.
ఈ నవల ఎంతో అద్భుతంగా ఆసక్తికరంగా ఉందని అయితే ఐదు భాగాలుగా ఉన్నటువంటి ఈ కథను డైరెక్టర్ మణిరత్నం గారు కేవలం రెండు భాగాలలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకు వస్తున్నారా అనే విషయం ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఉందంటూ ఈమె ఈ సినిమాలో తన పాత్ర గురించి తెలియజేశారు.ఇకఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనతో దూసుకుపోతుంది.కమర్షియల్ పరంగా ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది.