తెలుగు లో 100 కోట్ల క్లబ్ పై కన్నేసిన విజయ్ 'లియో'..క్రేజ్ మామూలుగా లేదుగా!

తమిళ హీరో విజయ్( Hero Vijay ) నటించిన లేటెస్ట్ చిత్రం ‘లియో’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా కి తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు.

 Hero Vijay Targets 100crore Club Leo In Telugu,hero Vijay,leo,100crore Club,jail-TeluguStop.com

సూపర్ స్టార్ రజినీకాంత్ కి తప్ప, ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు ఏ తమిళ హీరో కి కూడా జరగలేదు.ఇంకా గట్టిగా చెప్పాలంటే రజినీకాంత్( Rajinikanth ) కూడా ఈ రేంజ్ ని ఎప్పుడూ చూడలేదు.

ఈ చిత్రానికి ఆ స్థాయి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanagaraj ) అని చెప్పొచ్చు.ఆయన గత చిత్రాలు తెలుగు నాట సంచలనం సృష్టించాయి.

ముఖ్యంగా కమల్ హాసన్ విక్రమ్ చిత్రం అంటే ఇక్కడి యూత్ కి విపరీతమైన ఇష్టం.ఆ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కాబట్టే ఈ మూవీ పై ఈ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి.

Telugu Crore Club, Vijay, Jailer, Kollywood, Rajinikanth, Tamil, Tollywood-Movie

ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 7 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు( Leo Advance Bookings ) వచ్చాయి.ఇది దాదాపుగా స్టార్ హీరో రేంజ్ అనే చెప్పాలి.మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.అలా వీకెండ్ లోపు ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం జైలర్( Jailer ) చిత్రానికి మొదటి రోజు మన తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.కానీ ‘లియో'( Leo ) చిత్రానికి 7 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మొదటి రోజు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu Crore Club, Vijay, Jailer, Kollywood, Rajinikanth, Tamil, Tollywood-Movie

ఇదే రేంజ్ ఊపుని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తే ఈ చిత్రానికి కచ్చితంగా ఫుల్ రన్ లో కేవలం తెలుగు వెర్షన్ నుండే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.జైలర్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 84 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.‘లియో’ చిత్రానికి జైలర్ కంటే బెటర్ ట్రెండింగ్ ఉండడం తో కచ్చితంగా ఫుల్ రన్ లో వంద కోట్లు కొడుతుందని అంటున్నారు.ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే, టాక్ వస్తే మాత్రం ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో వంద కోట్లు కొల్లగొతుంది అని ఫిక్స్ అయిపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube