ఎఫ్ 3 ట్రైలర్ చూసిన చరణ్ అన్న ఆ మాట అన్నాడు.. వరుణ్ తేజ్!

మెగా హీరో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన తాజా చిత్రం ఎఫ్3.ఈ సినిమా నేడు అనగా మే 27న థియేటర్లో విడుదల అయిన విషయం తెలిసిందే.

 Hero Varun Tej Shares Interesting Things About F3 Movie , Varun Tej, F3 Movie, Tollywood, Ram Charan, Venkatesh, Anil Ravipudi-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఎఫ్ 2 సినిమా షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3 సినిమాను తీయాలి అని అనుకున్నామని వరుణ్ తెలిపాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి బాధ్యత దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు అని తెలిపాడు వరుణ్ తేజ్.అలాగే ఎఫ్ 3 సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

 Hero Varun Tej Shares Interesting Things About F3 Movie , Varun Tej, F3 Movie, Tollywood, Ram Charan, Venkatesh, Anil Ravipudi-ఎఫ్ 3 ట్రైలర్ చూసిన చరణ్ అన్న ఆ మాట అన్నాడు.. వరుణ్ తేజ్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరో వెంకటేష్ తో కలిసి రెండు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు.అలాగే ఎఫ్ 3 సినిమా టికెట్ల రేట్లు పెంచకపోవడం ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆనందం కలిగించే విషయం అని,ఈ సినిమాను కుటుంబం మొత్తం మళ్లీ మళ్లీ చూడవచ్చు చూసి ఫుల్ గా నవ్వుకోవచ్చు అని చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్.

అదేవిధంగా సినిమా రిలీజ్ అయిన తరువాత ఆడియన్స్ రియాక్షన్ ని బట్టి తన తదుపరి సినిమాను ఎంచుకుంటాను అని తెలిపారు.అలాగే ఎఫ్ 3 సినిమా ట్రైలర్ ని చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారని, వాళ్ళు ఎవరు షూటింగ్ కు రాలేదని, ఇక సినిమాలో తన మ్యానరిజం ని చూసి బాగానే చేశావని మెచ్చుకున్నారని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.ఈ సినిమా ట్రైలర్ ని చూసిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ చేసి బాగుంది అని ఫన్నీగా తెలిపాడు అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube