పంజాబ్ : భగవంత్ మాన్‌తో యూకే హైకమీషనర్ భేటీ .. కీలక రంగాల్లో పరస్పర సహకారానికి అంగీకారం

వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఫుడ్ ప్రాసెసింగ్, ఉన్నత విద్య, క్రీడలు, ప్రజా రవాణా (ఎలక్ట్రిక్ బస్సులు), బయోమాస్ రంగాల్లో మరిన్ని టై – అప్‌లను కుదుర్చుకోవడానికి పంజాబ్, యూకే ప్రభుత్వాలు గురువారం అంగీరించాయి.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 Punjab Cm Bhagwant Mann Meets British Envoy, Discusses Tie-ups In Education, It-TeluguStop.com

పంజాబ్ – యూకే మధ్య సహకారానికి సుదీర్ఘ చరిత్ర వుందని వీరిద్దరూ గుర్తుచేసుకున్నారు.పంజాబ్ ప్రజలు ఇప్పటికే ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేశారని సీఎం భగవంత్ మాన్ అన్నారు.

యూకేలోని అధునాతన సాంకేతికతలు ఈ రంగాలలో సామర్ధ్యాన్ని మరింతగా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో బ్రిటీష్ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ.పెట్టుబడిదారులందరికీ సింగిల్ విండో ఆన్‌లైన్‌ క్లియరెన్స్‌ను పంజాబ్ ప్రభుత్వం అందజేస్తుందని సీఎం చెప్పారు.పంజాబ్ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం మృదువైన, అవాంతరాలు లేని యంత్రాంగాన్ని నిర్మిస్తుందని భగవంత్ మాన్ అన్నారు.

యూకే నుంచి పెద్ద సంఖ్యలో పంజాబ్‌కు రావాలనుకుంటున్న పెట్టుబడిదారులతో తాను ఇప్పటికే టచ్‌లో వున్నానని ముఖ్యమంత్రి తెలిపారు.

Telugu Discusses Tie, Heathrowairport, Punjabbhagwant, Punjabcm-Telugu NRI

అలాగే చంఢీగడ్‌ నుంచి లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సమస్యను కూడా అలెక్స్ దృష్టికి తీసుకెళ్లారు భగవంత్ మాన్.ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులకు, ముఖ్యంగా పంజాబీలకు ఇది వీలుగా వుంటుందని సీఎం స్పష్టం చేశారు.దీనికి సంబంధించి ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తనతో సంప్రదింపులు జరిపాయని భగవంత్ మాన్ పేర్కొన్నారు.

వీటిపై సానుకూలంగా స్పందించిన బ్రిటీష్ హైకమీషనర్ అన్ని విధాలా సాయం చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube