హీరో తరుణ్.ఒకానొక సమయంలో సూపర్ హీరో.
మొదటి చిత్రంతో రికార్డులు బద్దలు కొట్టాడు.ఆతర్వాత తన అందంతో రొమాంటిక్ ప్రేమకథలలో నటించి తెలుగులో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు సినిమాల్లో లేకుండా పోయాడు.
మొదటి చిత్రంతో తెలుగు సినిమా రికార్డును తిరగరాసిన తరుణ్ ఆతర్వాత అంతటి విజయాన్ని అందుకోలేకపోయాడు.
ప్రారంభం తరుణ్ సినిమాలు బాగానే ఆడినప్పటికి ఆతర్వాత ఒక్కో సినిమా ప్లాప్ అవ్వడంతో తరుణ్ మెల్లగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యి ప్రస్తుతం ఆనందంగా బిజినెస్ చేసుకుంటూ జీవితాన్ని బిజీగా గడిపేస్తున్నాడు.
అయితే అప్పట్లో తరుణ్, ఆర్తి అగర్వాల్ ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నట్టు, వారి ఇద్దరి ప్రేమను రోజా రమణి ఒప్పోకోలేదని అందుకే ఆర్తి అగర్వాల్ అప్పట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయ్.
మరి ఆ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ అప్పట్లో తరుణ్ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయ్.
దీంతో ఆర్తి అగర్వాల్ సినీ కెరీర్ పైన, తరుణ్ సినీ కెరీర్ పైన దారుణమైన దెబ్బ పడింది.ఇక ఆతర్వాత ఇంట్లో చుసిన వారిని పెళ్లి చేసుకొని ఆర్తి సినిమాలకు గుడ్ బై చెప్పినప్పటికి రీ ఎంట్రీ ఇవ్వాలని లావు తగ్గేందుకు సర్జరీకి వెళ్లగా అది వికటించి ఆమె ప్రాణాలు వదిలింది.
ఇక తరుణ్ బిజినెస్ చేసుకుంటూ ఉండగా ఎప్పటికప్పుడు అతని పెళ్లిపై వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయ్.త్వరలోనే పెళ్లి కానీ వార్తలు వస్తూనే ఉంటాయ్.ఇక ఇప్పుడు కూడా అలాంటి వార్తే నెట్టింట వైరల్ అవుతుంది.అయితే ఈసారి వచ్చిన వార్త నిజమే అంటున్నారు కొందరు సినిమా వారు.
తరుణ్ తల్లి రోజా రమణి స్నేహితురాలు కూతురుని తరుణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఏర్పాట్లు చేస్తున్నారట.ఆ అమ్మయ్ ఇటీవల విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని తల్లితండ్రుల వద్దకి వచ్చిందట.
ఇక అప్పుడే తరుణ్ కి, ఆ అమ్మయ్ కి పెళ్లి నిశ్చయం చేసినట్టు వార్తలు వస్తున్నాయ్.మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.