మనలో చాలా మంది ఫేవరెట్ హీరోలని పోలీస్ రోల్స్ లో చూడాలని అనుకుంటారు.కానీ ప్రతి హీరో ఫ్యాన్ పోలీస్ రోల్ లో చూడాలని అనుకునేది రవితేజని మాత్రమే.
పోలీస్ రోల్ లో రవితేజ ఎనర్జీని ఎవరూ అందుకోలేరు.ఇప్పటి వరకు రవితేజ ఎన్ని సినిమాల్లో పోలీస్ రోల్ చేశాడో చూద్దాం.
క్రాక్
ఈ సినిమాలో సీఐ పోతురాజు వీర శంకర్ క్యారెక్టర్ చేశాడు.భయం లేని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఇందులో నటించాడు.
టచ్ చేసి చూడు
ఈ సినిమాలోనూ పోలీస్ రోల్ చేశాడు. ఏసీపీ కార్తికేయగా ప్రమాదకరమైన, డ్యూటీ డెడికేటెడ్ పోలీస్ రోల్ చేశాడు.
పవర్
ఈ మూవీలో ఏసీపీ బల్ దేవ్ సహాయ్ గా నటించాడు.అవినీతి, ఇంటెలిజెంట్ పోలీస్ పాత్రపోషించాడు.
మిరపకాయ్
ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్ స్పెక్టర్ రిషి పాత్ర పోసించాడు.ప్లేబాయ్, ఫన్నీ లెక్చరర్ గా చేస్తూనే అండర్ కవర్ కాప్ గా పనిచేస్తాడు.
కిక్
ఈ సినిమాలో ముందుగా ఫన్నీ క్యారెక్టర్ చేసిన రవితేజ.చివరి రెండు నిమిషాల్లో పోలీస్ రోల్ లో కనిపిస్తాడు.
దుబాయ్ శ్రీను
సీఐ శ్రీనివాస్ పాత్రలో కనిపిస్తాడు.చివరి 5 నిమిషాల్లో సినిమా స్టార్ సాల్మాన్ రాజ్ ను కాపాడుతాడు.
ఖతర్నాక్
ఈ సినిమాలో ముందుగా ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తాడు.అనంతరం క్రైం బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తాడు.
విక్రమార్కుడు
ఇందులో విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్ గా కనిపిస్తాడు.ధైర్యంగా అక్రమార్కుల అంతం చూసే రోల్ పోషిస్తాడు.
వెంకీ
ఇందులో ఎస్సై వెంకటుశ్వర్ రావుగా కనిపిస్తాడు.