నాగ చైతన్య, రాశి ఖన్నా.. థ్యాంక్యూ మూవీ స్టిల్ లీక్..!

బంగార్రాజుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్యూ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 Naga Chaitanya Rashi Khanna Thank You Still Leaked Details, Hero Nagachaitanya,-TeluguStop.com

విక్రం, చైతు ఇద్దరు కలిసి మనం సినిమా చేశారు.ఆ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఆసక్తి ఉంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది.ఈ సినిమాకు గ్రేట్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు.

సస్పెన్స్.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న థ్యాంక్యూ సినిమా నుండి లేటెస్ట్ గా ఓ స్టిల్ లీక్ అయ్యింది.

పార్క్ లో నాగ చైతన్య ల్యాప్ టాప్ లో వర్క్ చేసుకుంటుంటే.చలికి తనకు శాలువా కప్పుతూ రాశి ఖన్నా కనిపించింది.ఖచ్చితంగా సినిమాలో ఇదొక రొమాంటిక్ సీన్ లా అనిపిస్తుంది.థ్యాంక్యూ సినిమా నుండి లీకైన ఈ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగ చైతన్య, రాశి ఖన్నాల జోడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.థ్యాంక్యూ మూవీని నాగ చైతన్య ఈమధ్యనే పూర్తి చేసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube