నాగ చైతన్య, రాశి ఖన్నా.. థ్యాంక్యూ మూవీ స్టిల్ లీక్..!

బంగార్రాజుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్యూ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

విక్రం, చైతు ఇద్దరు కలిసి మనం సినిమా చేశారు.ఆ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఆసక్తి ఉంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది.ఈ సినిమాకు గ్రేట్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు.

సస్పెన్స్.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న థ్యాంక్యూ సినిమా నుండి లేటెస్ట్ గా ఓ స్టిల్ లీక్ అయ్యింది.

పార్క్ లో నాగ చైతన్య ల్యాప్ టాప్ లో వర్క్ చేసుకుంటుంటే.చలికి తనకు శాలువా కప్పుతూ రాశి ఖన్నా కనిపించింది.

ఖచ్చితంగా సినిమాలో ఇదొక రొమాంటిక్ సీన్ లా అనిపిస్తుంది.థ్యాంక్యూ సినిమా నుండి లీకైన ఈ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగ చైతన్య, రాశి ఖన్నాల జోడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.

థ్యాంక్యూ మూవీని నాగ చైతన్య ఈమధ్యనే పూర్తి చేసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఆ సమయంలో నిమ్మకాయ నీళ్లతో కడుపు నింపుకున్నా.. రవికృష్ణ కామెంట్స్ వైరల్!