కార్తికేయ 'రాజా విక్రమార్క' అప్పుడే పూర్తి చేశాడా..!

యువ హీరో కార్తికేయ లీడ్ రోల్ లో శ్రీ సరిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజా విక్రమార్క.లవ్ అండ్ యాక్షన్ ఎమోషనల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాను రామారెడ్డి నిర్మిస్తున్నారు.ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లినట్టు అనిపించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చృసుకున్నట్టు చిత్రయూనిట్ వెల్లడించింది.సినిమాలో కార్తికేయ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

 Hero Karthikeya Raja Vikramarka Shooting Completed, Karthikeya, Karthikeya Chavi-TeluguStop.com

త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెబుతున్న చిత్రయూనిట్ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా పిలిచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.కార్తికేయ ఈమధ్య నటించిన చావు కబురు చల్లగా సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.

అయితే ఈ సినిమా మాత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.

Telugu Karthikeya, Karthikeyachavu, Chiranjeevi, Raja Vikramarka, Rajavikramarka

చిరు టైటిల్ రాజా విక్రమార్క తో వస్తున్న కార్తికేయ ఈ సినిమాతో మెగా హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. కార్తికేయ మాత్రం ఈ సినిమాతో హిట్టు కొట్టడం పక్కా అన్న కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. యువ హీరోని ఈ సినిమా అయినా హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube