సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన కోలీవుడ్ స్టార్ హీరో

స్టార్ సెలబ్రిటీలు అంటే అభిమానుల కోలాహలం ఎక్కువగా ఉంటుందని సాధారణ జీవితానికి చాలా మంది దూరమైపోతారు.కొంత మంది అయితే సింపుల్ లైఫ్ లీడ్ చేస్తే ఎక్కడ మన స్టార్ స్టేటస్ పడిపోతుందో అనే భయంతో హైఫైగా బ్రతుకుతూ అవసరం లేకపోయినా అనవసరమైన ఆడంబరాలకి పోతూ ప్రజలకి దూరంగా బ్రతుకుతూ ఉంటారు.

 Hero Ajith Simplicity Goes Viral In Social Media, Tollywood, Kollywood, Auto Jou-TeluguStop.com

ముఖ్యంగా తెలుగు హీరో, హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ విషయంలో వారు అందరికంటే ముందు వరుసలో ఉంటారు.

ఓ రెండు హిట్స్ పడగానే మన సెలబ్రిటీలు సాధారణ జీవితాన్ని పక్కన పెట్టి వారికంటూ క్రియేట్ చేసుకున్న ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు.నలుగురుతో కలిసి స్వేచ్చగా రోడ్డు మీద జనం మధ్యలో తిరగడానికి కూడా ఇష్టపడరు.

అయితే మలయాళీ హీరోలు అందరూ కూడా చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు.జనావాసాల్లోనే ఉంటూ సాధారణ ప్రజల మాదిరిగానే సింపుల్ గా రోడ్డు మీదకి వెళ్ళిపోతారు.

Telugu Ajith Auto, Auto Journey, Ajith, Kollywood, Malayalam, Tollywood-Movie

ఫ్యాన్స్ కూడా వారిని అంతగా ఇబ్బంది పెట్టరు.కేవలం పలకరించి వెళ్ళిపోతూ ఉంటారు.ఇలాంటి లైఫ్ ని తమిళంలో స్టార్ హీరో, అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కూడా లీడ్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటాడు.ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన సింపుల్ గా బ్రతకడానికే అతను ఇష్టపడుతూ ఉంటాడు.

షూటింగ్ కి సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు.అలాగే అప్పుడప్పుడు ఆటోలో కూడా చెన్నై రోడ్లు మీద తిరిగేస్తాడు.

ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా తాను ఎక్కడికి వెళ్లాలని అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు.అలాగే తనకి ఇష్టమైన స్పోర్ట్స్ బైక్స్ మీద లాంగ్ రైడ్ కి వెళ్తూ ఉంటాడు.

తాజాగా చెన్నైలో ఆటోలో తిరుగుతున్న ఇతని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంత సింప్లిసిటీ ఎలా వస్తుందని నెటిజన్లు అజిత్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube