ఒంటిపై మంటలతో 100 మీటర్లు పరిగెత్తాడు.. ఇదొక సాహసమే

పందెం పరుగులో ఉసెన్ బోల్ట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ప్రపంచంలోనే నెంబర్ వన్ రన్నింగ్ రేసర్ గా ఆయన ఎన్నో రికార్డులు సృష్టించారు.

 He Ran 100 Meters With Fire On His Back.. This Is An Adventure , Running With F-TeluguStop.com

చిరుత కంటే ఎక్కువ వేగంతో పరుగులు తీసే శక్తి ఉసెన్ బోల్ట్ కు ఉంది.అయితే పరుగు పందెంలో చాలామంది అనేక రికార్డులు సృష్టిస్తున్నారు.

తాజాగా ఒక వ్యక్తి ఒంటిపై మంటలతో 100 మీటర్లు పరిగెత్తాడు.ఒక ఫైర్ ఫైటర్ ఈ రికార్డును సృష్టించి గిన్నీస్ బుక్( Guinness World Records ) లోకి ఎక్కాడు.

శరీరానికి చిన్న వేడి తగిలితేనే మనం తట్టుకోలేం.అలాంటిది ఒంటిపై మంటలతో అంత దూరం పరిగెత్తడమంటే సాహసమే అని చెప్పవచ్చు.

Telugu Meters, Adventure Stunt, Latest, Risky Stunt, Flames-Latest News - Telugu

జోనాథన్( Jonathan ) అనే వ్యక్తి ఈ రికార్డు సృష్టించాడు.అతనికి చిన్నప్పటి నుంచి మంటలంటే చాలా ఇష్టమట.మంటలతో ఆటలు ఆడేవాడు.మంటలను మిగడం, ఫైర్ షోలలో మంటలను అర్పడం లాంటివి చేసేవాడు.ఇప్పుడు ఏకంగా 100 మీటర్లు ఒంటిపై మంటలతో పరిగెత్తి రికార్డు నెలకొల్పాడు.ఆక్సిజన్ లేకుండా ఒంటిపై మంటలు మండుతుంటే 100 మీటర్ల దూరాన్ని 17 సెకన్లలోనే పరిగెత్తాడు.

గిన్నీస్ వరల్డ్ రికార్డు దీనికి సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్(Twitter ) లో పోస్ట్ చేసింది.

Telugu Meters, Adventure Stunt, Latest, Risky Stunt, Flames-Latest News - Telugu

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.ఇలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.మరికొంతమంది ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లను రికార్డులలోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఇక మరికొంతమంది ఇది రాకార్డు ఎలా అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చే ఇలాంటి ఆటలను ప్రోత్సహించవద్దని మరికొంతమంది సూచిస్తున్నారు.

ఇలాంటి వాటిని చూసి చాలామంది ట్రై చేసే అవకాశం ఉందని, దాని వల్ల ప్రాణాలను పొగోట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube