మేగీని మీరు ఇలా ఎపుడైనా ట్రై చేసారా? చూస్తుంటేనే వాంతొస్తోంది!

తినొద్దని ఎన్ని ప్రసారాలు జరిగినా, చిన్నపిల్లలనుండి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తినేది మేగీ నూడిల్స్.అవును, దీనిలో అత్యధికశాతం సీసం కలుపుతుండటం చేత, ముఖ్యంగా చిన్నపిల్లలు తింటే అనారోగ్యం పాలవుతారని ఓ సమయంలో వార్తలు తాండవించాయి.

 Have You Ever Tried Maggi Like This ,maggie, Viral Latest, News Viral, Latest Ne-TeluguStop.com

అయినా వాటి మార్కెటింగుని ఎవరు ఆపలేకపోయారు.అదంతా పక్కన బెడితే, ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ కి వున్న ఆదరణ మరీ ఇతర రెస్టారెంట్లకు ఉండదు అంటే మీరు నమ్ముతారా?

ఇక్కడ ఏ ఏరియాలో చూసినా బండ్లపై అమ్మే ఫుడ్ వెరైటీస్ జనాలని ఆకర్షిస్తూ ఉంటాయి.ఇంకా ఒక ఫుడ్ ని రకరకాలుగా చేయడం మాత్రం ఇండియాలో కనిపిస్తుంది.కొత్త కొత్త వెరైటీస్ ను ఇక్కడి ప్రజలు ఇష్టపడుతూ వుంటారు.అందుకే చిరు వ్యాపారస్తులు కొన్ని కొన్ని ప్రయోగాలు చేసి ఊరిస్తూ వుంటారు.అయితే ఇది అన్ని సార్లు సక్సెస్ కాకపోవచ్చు.

బెడిసి కొట్టవచ్చు లేదంటే, మనకు చూడటానికి అసహ్యంగా కనిపించొచ్చు.అయితే దానికి ప్రజలు ఇష్టంగా కూడా తినొచ్చు.

ఏమైనా జరగొచ్చు.

ఇకపోతే సోషల్ మీడియాలో ఓ రెసిపీ తెగ వైరల్ అవుతోంది.ఇక్కడ కనబడుతున్న వీడియోలో ఓ వ్యక్తి చేసిన వంట చూస్తే మీకు కోపం రావచ్చు.అవును, ఇక్కడ వంటగాడికి ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది.

వచ్చిందే తడవుగా మ్యాగీని కోల్డ్ కాఫీతో మరిగించి ఉడికించాడు.ఇంకేముంది అది కాస్త కాఫీ మ్యాగీ అయింది.

అయితే దానిని ఆర్డర్ చేసుకొని తింటున్నవారు లేకపోలేదు.వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజం.

ఇక్కడ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.జనాలు మాత్రం ఆ రెసిపీని బాగా యేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube