ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి.జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల పేద వర్గాల ప్రజలు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ జీవితాలపై ఉన్న ఆర్థిక భారాలు సగానికి పైగానే వైయస్ జగన్ ప్రభుత్వం భరించే రీతిలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం ఇంకా రైతులకు సంబంధించిన అనేక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా “వైఎస్ఆర్ రైతు భరోసా” పేరిట రైతులకు ప్రోత్సాహాలు అందించే రీతిలో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు.ఇప్పటికే ఓ విడత కార్యక్రమం జరిగింది.ఈ నేపథ్యంలో అక్టోబర్ 17వ తారీకు రెండో విడత వైయస్సార్ రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంటులలో వేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయింది.పిఎం కిసాన్ కింద.₹6వేలు, రైతు భరోసా కింద ₹7,500 కలిపి ఏటా మూడు విడుతలలో ₹13,500 రైతుల ఖాతాలో జమ అవుతాయి.ఇప్పటికే తొలి విడత కింద ₹7,500 ఇవ్వటం జరిగింది.
ఇంకా రెండో విడతలో అక్టోబర్ 17వ తారీఖున ₹4000 జగన్ ప్రభుత్వం ఇవ్వనుంది.ఇంకా చివరి విడత కింద రెండు వేల రూపాయలు రైతుల అకౌంటులలో డబ్బులు జమ చేయనుంది.







