ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టూల్ చాట్ జీపీటీ హవ కొనసాగుతోంది.ఇక ప్రజల నుండి కూడా మంచి ఆదరణ చాట్ జీపీటీ కు లభించి, పాపులారిటీ పెరగడంతో, సైబర్ నేరగాళ్లు సైతం ఫేక్ యాప్స్ తో యూజర్లను దోచుకోవాలని టెక్నాలజీని విపరీతంగా వాడేస్తున్నారు.
ఫేక్ చాట్ జీపీటీ యాప్ తో యూజర్ల ఇంస్టాగ్రామ్, జిమెయిల్ వివరాలను యాక్సెస్ చేస్తున్నారు.యూజర్లను న్యూ మాల్ వేర్ తో కూడిన ఫేక్ చాట్ జీపీటీ యాప్ తో హ్యాక్ చేయడానికి సైబర్ కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారని, యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
ఫేక్ డెస్క్ టాప్ యాప్ లింకులను క్రియేట్ చేసి చాట్ జీపీటీ వినియోగదారులకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో బ్లాగ్ పోస్ట్ చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై తెలిపింది.యూజర్లను మభ్య పెట్టేందుకు ఈ లింకుతో కూడిన పోస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బ్యాంక్ ఖాతాలో 50 డాలర్లు క్రెడిట్ అవుతాయని ఒక నోటిఫికేషన్ వస్తుందని సైబర్ క్రైమ్ వెల్లడించింది.పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేస్తే మన సిస్టం లో మాల్ వేర్ ఇన్ స్టాల్ అవడంతో పాటు క్షణాల్లో డేటా మొత్తం హ్యాక్ చేయబడుతుంది.
ఫేక్ యాప్ డౌన్లోడ్ అవుతున్న సందర్భంలో ఎర్రర్ అని మెసేజ్ వచ్చి బ్యాక్ గ్రౌండ్ లో మాల్వేర్ ప్రోబో ఇన్స్టాల్ అవుతుంది.ఎప్పుడైతే మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందో డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్ళే విధంగా ఈ యాప్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటుంది.పైగా గూగుల్ లాగిన్, టిక్ టాక్, ఫేస్ బుక్ ల వివరాలు సులభంగా హ్యాకర్ల చేతులోకి వెళ్తాయి.
ఇంకా బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన సమాచారం అంతా వారి చేతిలోకి వెళ్తుంది.తెలియకుండా అనవసరంగా ఏవైనా మెసేజెస్, నోటిఫికేషన్స్, యాప్స్ లాంటివి డౌన్లోడ్ చేసుకోవడం, టచ్ చేయడం వంటివి చేయకూడదని సైబర్ క్రైమ్ అధికారులు యూజర్లను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.